Sunday, January 21, 2018 - 10:23

పెద్దపల్లి : జిల్లాలో రైతుకంట కన్నీరు వలుకుతోంది. సుల్దానాబాద్‌,ఓదెల, ఎలిగెడు జుల్లపల్లి, కాల్యశ్రీరాంపూర్‌లో వేసిన పంటలు ఎండిపోయాయి. అప్పుజేసి సాగుచేసిన వరిపంట... నీరులేక ఎండిపోయింది. పొలం నెర్రెలు వారింది. ఎండిపోయిన పంటను పశువులు మేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుచోతని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువలకు నీరు విడుదల చేస్తే ఈ పరిస్థితి దాపురించేంది కాదని...

Wednesday, January 17, 2018 - 11:11

పెద్దపల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. శ్రీరాంసాగర్ రెండు కెనాల్ల ద్వారా పెద్దపలి నియోజకవర్గానికి నీరందుతోంది. డీ 83, డీ 86 కెనాళ్లకు నీరు విడుదల చేయకపోడంతో చివరి ఆయుకట్టు రైతులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. నీరు...

Wednesday, January 17, 2018 - 09:24

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఎస్ఆర్ ఎస్ పి నీటిని కాకతీయ కెనాల్ ద్వారా తన నియోజకవర్గానికి మంత్రి ఈటెల విడుదల చేయడంతో వివాదం ప్రారంభమైంది. మంత్రి ఈటెల చర్యను రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ తమ నియోజకవర్గాలకు నీటిని విడుదల చేశారని..ఇతర...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Saturday, January 6, 2018 - 21:18

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని జీవీకే ఇంక్లైన్‌ 1లోని 33వ డీప్‌లో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గని అధికారులు..కార్మికులను బయటకు పంపుతున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, January 6, 2018 - 12:31

పెద్దపల్లి : నియోజకవర్గం జిల్లాల పునర్విభజనతో పెద్దపల్లి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. నియోజక వర్గం దాదాపుగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. రామగుండం, చొప్పదండి, మంథని నియోజక వర్గాల్లో శరవేగంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నా.. పెద్దపల్లి పరిధిలో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగక పోవడంతో ఇక్కడి ప్రజలకు నీటి సమస్య ఎక్కువైంది.

116తో...

Friday, January 5, 2018 - 17:52

పెద్దపల్లి : జిల్లాలోని ఉసేన్‌మియా వాగుపై చేపట్టే ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మండలంకి చెందిన ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి వాగుపై ప్రాజెక్ట్‌ కోసం ప్రత్యేకంగా 22కోట్ల 18లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఎగువన ప్రాజెక్ట్‌ నిర్మించడం వల్ల వాగునుండి నీరు రాక తమకు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన...

Thursday, January 4, 2018 - 17:58

పెద్దపల్లి : నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా మృగాళ్లు చెలరేగిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై.. కడంబాపూర్‌కు చెందిన పెద్ది నగేష్‌ లైంగికదాడికి తెగబడ్డాడు. కనుకుల అటవీ ప్రాంతంలో కట్టెలు ఏరేందుకు వెళ్లిన మైనర్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిన నగేష్‌ అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను...

Wednesday, January 3, 2018 - 17:40

పెద్దపల్లి : టెన్‌టీవీ ప్రజలతో మమేకమై... ప్రజా మన్ననలు పొందుతోందని మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ అన్నారు... అదే ఒరవడిని కొనసాగిస్తూ... మరింతగా సమస్యలను వెలుగులోకి తేవాలని కోరారు... టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మధుకర్... టెన్‌టీవీ ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలవాలన్నారు.

Pages

Don't Miss