Monday, April 10, 2017 - 11:27

పెద్దపల్లి :హైకోర్టు ఆదేశాల ప్రకారం మరికాసేపట్లో మంథని మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా ఏసీపీ సింధుశర్మ తెలిపారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా రాత్రి నుంచి మధుకర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్పాట్‌లో పోలీసులతో పాటు మధుకర్ కుటుంబసభ్యులనూ ఉంచామని ఆమె తెలిపారు. రీపోస్టుమార్టం తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామన్నారు.  

Monday, April 10, 2017 - 11:21

పెద్దపల్లి : మధుకర్‌ మృతదేహానికి మరికాసేపట్లో రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. పెద్దపల్లి జిల్లా ఖానాపూర్‌లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ చీఫ్‌ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, మధుకర్‌ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రీ పోస్ట్‌మార్టం చేయనున్నారు. ఉస్మానియా, కేఎంసీ వైద్యుల బృందం రీపోస్టుమార్టం చేయనుంది. రీపోస్ట్‌మార్టంతో వాస్తవాలు వెలుగుచూస్తాయని...

Monday, April 10, 2017 - 09:14

పెద్దపల్లి: మధుకర్ ది ముమ్మాటికి హత్యే అని దళిత సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. మంథనిలో అనుమానాస్పద మృతిగా భావించిన మధుకర్ మృత దేహానికి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దళిత నేతలు మాట్లాడుతూ మనుధర్మశాస్త్రం పరిపాలన చేస్తోందన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల సంఘానికి కూడా చేస్తామని హెచ్చరించారు. నాకు న్యాయం కావాలని మధుకర్ తల్లి పేర్కొన్నారు. నిందితులకు ఉరిశిక్ష...

Thursday, April 6, 2017 - 12:31

హైదరాబాద్ : మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి కేసును పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు. అయితే మధ్నాహ్నం 2.30 గంటలకు లంచ్‌ మోషన్‌ పిటీషన్‌ హైకోర్టులో విచారణకు రానుంది....

Wednesday, April 5, 2017 - 21:31

పెద్దపల్లి : కలకలం రేపుతున్న పెద్దపల్లి జిల్లా మంథని ఖానాపూర్‌లోని దళిత యువకుడు మధుకర్ అనుమానాస్పద మృతిపై పోలీసుల యాక్షన్ మొదలయింది..మధుకర్ మార్చి 14న చనిపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... అనుమానాస్పద మృతి చెందినట్లుగా అనుమానిస్తూ కలకలం రేపింది.. మధుకర్ ప్రేమ వ్యవహారంలోనే పరువు హత్య జరిగి ఉంటుందని అనుమానించడంతో ఈ కేసు తీవ్రస్థాయికి చేరింది..దళిత యువకుడు...

Wednesday, April 5, 2017 - 17:36

పెద్దపల్లి : మంథనిలో సంచలనం రేపిన మధుకర్‌ హత్య కేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితులు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా వారి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. ఇదిలావుంటే.. ఎల్లుండి మధుకర్‌ మృతదేహానికి వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్యులు రీపోస్ట్‌మార్టం చేయనున్నారు.

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Tuesday, April 4, 2017 - 17:49

పెద్దపల్లి : ఇచ్చిన అప్పు తిరిగి అడిగిన పాపానికి ఓ మహిళను దారుణంగా కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్యచేశాడో దుర్మార్గుడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన స్రవంతి, సంతోష్‌ దంపతులు రెండేళ్ల క్రితం ఇంటి ఎదురుగా ఉండే రాదాటి శ్రీనివాస్‌ అనే యువకునికి 40 వేల రూపాయల అప్పు ఇచ్చారు. అప్పు విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. స్రవంతి భర్త సంతోష్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో...

Tuesday, April 4, 2017 - 08:12

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు మధుకర్‌ హత్య కేసును.. ఏసీపీ సింధుశర్మకు బదలాయించినట్టు.. డీసీపీ విజయేందర్‌రెడ్డి తెలిపారు.  దీంతో ఏసీపీ సింధుశర్మ.. ఖానాపూర్‌లోని ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిందని... అందులో మధుకర్‌ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేలిందన్నారు ఏసీపీ. రిపోర్ట్‌ను ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపిస్తామన్నారు. బాధితు...

Pages

Don't Miss