Friday, June 23, 2017 - 20:09

పెద్దపల్లి : రామగుండంలోని సింగరేణి కాలరీస్‌ ఓసీపీ-3 బొగ్గు గనిలో  ప్రమాదం జరిగింది. డంపర్‌ ఢీ కొట్టడంతో హెడ్‌ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న వనం రాజేంద్రప్రసాద్‌ మృతి చెందాడు. ఇందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో సింగరేణిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని...

Thursday, June 22, 2017 - 16:41

హైదరాబాద్: సింగరేణిలో జరుగుతోన్న వారసత్వ సమ్మెకు.. మేము సైతం అంటూ కార్మికుల వారసులు ముందుకొస్తున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి యాజమాన్యం, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామంటున్నారు. మరో పోరాటానికి యువకులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Wednesday, June 21, 2017 - 10:34

కరీంనగర్ : వారసత్వ ఉద్యోగాల సాధన కోసం నల్ల సూర్యులు చేస్తున్న సమ్మెతో తట్ట, చెమ్మస్‌లు మూలన పడ్డాయి. యంత్రం ఆగిపోవడంతో బొగ్గు బయటకు రావడం లేదు. కార్మికుల సమ్మె దెబ్బతో యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. బొగ్గు గనులన్నీకార్మికులు లేక బోసి పోతున్నాయి. ఓ వైపు సమ్మె విచ్ఛిన్నం చేయడానికి యాజమాన్యం కుట్ర...మరో వైపు సమ్మె పై పోలీసులు ఉక్కుపాదంమోపుతుండడంతో కోల్ బెల్ట్ లో అప్రకటిత...

Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Saturday, June 17, 2017 - 11:41

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో.. సింగరేణి కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులు, కార్మిక నాయకుల అరెస్ట్‌లకు వ్యతిరేకంగా ఈరోజు కోల్‌ బెల్ట్‌ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ నేపథ్యంలో గోదావరిఖని చౌరస్తాలో ధర్నా చేస్తున్న CITU నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Thursday, June 15, 2017 - 13:48

పెద్దపల్లి : వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు చేస్తున్న సమ్మె విజయవంతమైందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలిపారు. వారసత్వ ఉద్యోగాల డిమాండ్‌ సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని నేతలు హెచ్చరిస్తున్నారు. గుర్తింపు యూనియన్‌, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై కార్మికుల కుటుంబాల జీవితాల్లో మట్టి కొట్టాలని చూస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం...

Thursday, June 15, 2017 - 13:45

పెద్దపల్లి : సింగరేణిలో సమ్మె సక్సెస్‌ అయింది. 5 జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో పాటు.. 9 డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. అయితే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమ్మెకు దూరంగా ఉంటుంది. మరోవైపు ఈ నెల 19 నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో కార్మికులు సమ్మె చేయనున్నారు. రామగుండంలో కార్మికులంతా విధులు బహిష్కరించి...

Thursday, June 15, 2017 - 10:14

పెద్దపల్లి : రామగుండం రీజియన్ లో సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. జిల్లాలోని రామగుండం, గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మిక సంఘాల నేతలు గనుల వద్దకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది పోలీసులతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో కార్మికులు..కార్మిక సంఘాల నేతలు గనులకు దూరంగానే ఆందోళనలు...

Thursday, June 15, 2017 - 09:34

పెద్దపల్లి : వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ లక్ష్యంగా సింగరేణి కార్మికులు సమ్మెకు దిగాయి. గోదావరిఖని, రామగుండంలో ఉదయం నుంచి కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు.
34 భూగర్భ గనులు..17 ఓపెన్ కాస్టు గనుల్లో సమ్మె ప్రభావం కనిపిస్తోంది. దాదాపు పది శాతం కార్మికులు మాత్రమే హాజరయ్యారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘం టీజీబీకెఎస్...

Thursday, June 15, 2017 - 08:57

గోదావరిఖని : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. నిరవధిక సమ్మెకు 5 జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలని మార్చి 31 న సమ్మె నోటిస్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కార్మికులు సమ్మె దిగినట్టు తెలుస్తోంది. ఈ సమ్మెకు తెలంగాన బొగ్గుగని కార్మిక సంఘం దూరంగా ఉంది....

Tuesday, June 13, 2017 - 12:25

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అడ్డువచ్చిన ఆస్పత్రి సిబ్బందితో పాటు కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Pages

Don't Miss