Wednesday, July 4, 2018 - 19:29

పెద్దపల్లి : సింగరేణి సిరుల తల్లి ఒడిన మరో ఓపెన్‌కాస్ట్‌ పురుడుపోసుకోనుంది. అన్ని రకాల అనుమతుల కోసం సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. 2019 నాటికి బొగ్గు ఉత్పత్తిని వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని యోచిస్తోంది సింగరేణి సంస్థ. 
మరో ఓపెన్‌ కాస్ట్‌ ప్రారంభానికి ప్రణాళికలు 
పెద్దపల్లి జిల్లాలోని...

Sunday, July 1, 2018 - 21:12

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా బసంత్‌ నగర్‌ టోల్‌ గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బసంత్‌ నగర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 44 జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు...

Sunday, July 1, 2018 - 09:39

పెద్దపల్లి : ఓదెల మండలం ఉప్పరపల్లిలో యువకుడు విజయ్ రెడ్డి దారుణ హత్య గావించబడ్డారు. దుండగులు పారతో కొట్టి చంపారు. హత్య జరిగిన తర్వాత తండ్రి కనిపించకుండా పోయారు. తండ్రి కొడుకుల మధ్య నెలరోజులుగా ఘర్షణ జరుగుతోంది. కుటుంబ సభ్యులపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రెడ్డిని అతడి తండ్రి హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మరిన్ని వివరాలరను వీడియోలో చూద్దాం...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Saturday, June 23, 2018 - 09:57

పెద్దపల్లి : అల్లనేరేడు పండ్లు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. పండ్లు కోసుకుంటూ ఓ బావిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన కుర్మపల్లిలో చోటు చేసుకుంది. ప్రణీత్, అరవింద్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లారు. అల్లనేరేడు పండ్లు తెంపుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయారు. రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెతికారు. ఫలితం కనబడడం లేదు...

Tuesday, June 19, 2018 - 13:46

పెద్దపల్లి : రామగుండం సింగరేణిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులో విషవాయులు, మంటలు వెలువడుతున్నాయి. గతంలో మూసివేసిన 8.8ఏ బొగ్గు గని నుంచి విషవాయులు వెలువడుతున్నాయి. సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు యాజమాన్యం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

 

Monday, June 11, 2018 - 09:36

పెద్దపల్లి : సామాజిక సేవే లక్ష్యంగా పేదలు..దివ్యాంగులకు సాయం చేస్తామని హైకోర్టు న్యాయవాదులు గట్టు నాగమణి..గట్టు వామన్ రావు దంపతులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం మహదేవ్ పూర్ లో రంజాన్ పండుగ సందర్భంగా 'గట్టు లా ఛాంబర్స్' ఆధ్వర్యంలో 300 ముస్లిం కుటుంబాలకు ఇఫ్తార్ విందు..దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...న్యాయ సహాయం కోసం వచ్చే పేదలకు ఉచితంగా...

Saturday, June 9, 2018 - 20:52

పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం.. పూసాల గ్రామంలోని రైస్‌ మిల్లులో ప్రమాదం చోటుచేసుకుంది. మహా లక్ష్మి రైస్ మిల్లులో బాయిలర్ పేలడంతో.. ఒక గోదాం నేలమట్టం అయ్యింది. దీని పక్కనే ఉన్నవరలక్ష్మి రైస్ మిల్లు కూడా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఐదు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. పేలుడు శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రైస్‌ మిల్లు యాజమాన్యం సరైన...

Friday, June 8, 2018 - 16:48

పెద్దపల్లి : దాదాపు 7 కోట్ల రూపాయలతో ఆర్భాటంగా దుకాణాల సముదాయాన్ని నిర్మించారు రామగుండం మున్సిపల్‌ అధికారులు. నిర్మాణమైతే పూర్తి చేశారు కానీ నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగ మారింది. మందుబాబులకు నిలయంగా, పేకాటరాయుళ్లకు స్థావరంగా మారింది.  

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ.. నగరం నడిబొడ్డున నిర్మించిన మున్సిపల్‌ దుకాణాల సముదాయం గత ఐదు...

Friday, June 8, 2018 - 08:26

పెద్దపల్లి : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని దారుణంగా చంపేశారు. భార్యే చంపేసిందని పోలీసులు భావించి ఆమెను విచారించగా హత్య విషయం చెప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...అప్పన్నపేట పంచాయతీ పరిధిలో కొప్పులు ఓదేలు (65) భార్యతో నివాసం ఉంటున్నాడు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన ఓదేలు ఎప్పటిలాగానే గురువారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. తెల్లారేసరికి రక్తపుమడుగులో...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Pages

Don't Miss