Thursday, May 24, 2018 - 08:53

పెద్దపల్లి : జిల్లా మంథనిలో దొంగతనానికి వచ్చి గొంతు కోసిన సంఘటన సంచలనం సృష్టిచింది. మంథనిలోని ఓ రెస్టారెంట్లో పనిచేసే రవి తెల్లవారు జామున రెస్టారెంట్‌ టెర్రస్‌ పై పడుకున్నాడు. ఇతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్స్‌ దొంగిలించడానికి ఓ దొంగ ప్రయత్నించారు. రవి ప్రతిఘటించగా ఆ దొంగ రవి గొంతుకోసి పరారయ్యాడు. గాయాలపాలైన బాధితున్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్‌లో 10 మంది...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Tuesday, May 8, 2018 - 19:55

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని మార్కండేయ కాలనీలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు భైఠాయించింది. 'ప్రేమించానని నీతోనే జీవితాంతం ఉంటానని చెప్పి నన్ను సింగారపు సృజన్ పెళ్లి చేసుకుని.. ఇప్పుడు ఇంట్లోలో నుంచి వెళ్లి పోమన్నాడని' బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. 'నీది తక్కువ కులమనే పేరుతో ఇంట్లో వాళ్లు తిడుతున్నారని..నువ్వు నాకు వద్దంటూ ఇంట్లో నుంచి బయటకి పంపాడని' ఆరోపించింది. '...

Monday, May 7, 2018 - 18:36

పెద్దపల్లి : జిల్లా మంథనిలో శివాలయం వేదికగా టీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తుమ్మిచెరువు ఆధునీకరణలో భాగంగా.. కట్టపై ఉన్న పురాతనమైన శివలింగం, నంది విగ్రహాలను తొలగించి మట్టిపోయడంతో వివాదం తలెత్తింది. అయితే ఈ పనిని ఎమ్మెల్యే పుట్టా మధు దగ్గర ఉండి చేయించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మరోనేత సునీల్‌రెడ్డి ఆ విగ్రహాలపై మట్టిని తొలగించి పాలాభిషేకం...

Thursday, May 3, 2018 - 11:47

పెద్దపల్లి : సింగరేణి, గ్యాస్‌పైపు లైన్‌, విద్యుత్‌లైన్‌ల నిర్మాణాలు ఇవన్నీ ఆ గ్రామానికి శాపంగా మారాయి. అధికారుల అవినీతి సర్వేలతో తీవ్రంగా నష్టపోతున్నామని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి రైతులు అంటున్నారు. భూమికి హక్కు దారులైనప్పటికీ సింగరేణి యాజమాన్యం చేసిన బలవంతపు సేకరణతో వారి భూమి మీద వారికే హక్కులేకుండా పోయింది. పోలీసుల బెదిరింపులతో విలువైన భూముల్లో పైప్‌లైన్ల...

Tuesday, May 1, 2018 - 12:55

పెద్దపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైస్‌ మిల్లు ఆపరేటర్స్‌కు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని 350 మంది కార్మికులు ఆందోళ చేపట్టారు. కార్మికుల సమ్మెతో రైస్‌ మిల్లుల్లో పనులు నిలిచిపోయినా.. యజమాన్యాలు మాత్రం సమ్మె వైపు చూడడం లేదు. 

 

Monday, April 30, 2018 - 20:36

పెద్దపల్లి : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైస్‌ మిల్లు ఆపరేటర్స్‌కు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని 350 మంది కార్మికులు ఆందోళ చేపట్టారు. కార్మికుల సమ్మెతో రైస్‌ మిల్లుల్లో పనులు నిలిచిపోయినా.. యజమాన్యాలు మాత్రం సమ్మె వైపు చూడడం లేదు. యజమాన్యాలు దిగి వచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామంటున్న...

Wednesday, April 25, 2018 - 19:31

పెద్దపల్లి : టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండగా ఉంటోందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. సర్కార్ అండతో... తెలంగాణలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు. అతివేగంతో నడిచే ఇసుక లారీలు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టనట్లు ఉందని ఆయన ఆరోపించారు. ఇసుకమాఫియాను...

Monday, April 23, 2018 - 17:42

పెద్దపల్లి : ఇసుక మాఫియాను అరికట్టాలంటూ.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా నడుస్తోందని గ్రామస్థులు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఇసుక లారీ ఢీ కొన్నఘటనలో ఆదివారంపేట గ్రామ ఉపసర్పంచ్‌ ఏలుక రాజయ్య మృతి చెందారు. దీంతో ఆగ్రహానికి లోనైన మృతుడి బంధువులు, గ్రామస్థులు ఇవాళ ప్రధాన రదహదారిపై ధర్నాకు...

Friday, April 20, 2018 - 15:47

పెద్దపల్లి : నియోజకవర్గంలోని రైతాంగానికి తాగు, సాగు నీరు అందించకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే విజయరమణ. పెద్దపల్లిలో రైతులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. పాదయాత్రలో పాల్గొనకుండా విజయరమణను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వమే స్పందించి పెద్దపల్లికి సాగు, తాగు...

Pages

Don't Miss