Monday, January 1, 2018 - 21:37

కరీంనగర్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక లోటుతో ఉన్న విద్యుత్‌ కాస్తా మిగులు విద్యుత్‌ గా మారిందని ఆయన అన్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కేశారం గ్రామంలో ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి నేటి నుండి 24గంటల ఉచిత విద్యుత్‌...

Monday, January 1, 2018 - 16:12

కరీంనగర్/పెద్దపల్లి : జిల్లా మంథని ప్రబుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈటల కాలేజీ నుంచి వెళ్లిపోగానే తరగతి గదిలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ సహచరుడు మద్యం సేవించాడు. శ్రీనివాస్ మద్యం తాగుతున్న కాలేజీ సిబ్బంతి పట్టించుకోవడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Saturday, December 30, 2017 - 13:43

పెద్దపల్లి : జిల్లాలోని మంథనిలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్‌ రెడ్డి 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కరానికి 10 టీవీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. 10 టీవీ కార్యక్రమాలు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించేలా ఉన్నాయని, రెండు రాష్ట్రాల ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకుందన్నారు. ఈ సందర్భంగా 10 టీవీ ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Monday, December 11, 2017 - 18:24

కరీంనగర్ : జిల్లా ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు నిర్మాణంతో ఉపాధి కోల్పోయారు. దీంతో మత్స్యకారులు పనులను అడ్డుకొని ఆందోళన చేస్తున్నారు. దీంతో ఐదు రోజులుగా పనులు నిలిచి పోవడంతో రిజర్వాయర్‌ వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు.

Friday, December 8, 2017 - 20:26

కరీంనగర్ : కాళేశ్వరం బ్యారేజీ పనులు 2018 నాటికి పూర్తి చేయాలని..అప్పుడే రైతులకిచ్చిన మాట నెరవేరుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు సందర్శించిన సీఎం...కాళేశ్వరం బ్యారేజీ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు టన్నెల్‌ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... శనివారం హైదరాబాద్‌లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

అనంతరం మేడారం...

Friday, December 8, 2017 - 17:57

ఉమ్మడి కరీంనగర్ : జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం మిడ్‌మానేరు ప్రాజెక్టును ఏరియా సర్వే చేసిన అనంతరం... ముఖ్యమంత్రి హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. తన 2 రోజుల పర్యటనలో 3 బ్యారేజ్‌లు, 4 పంప్‌హౌజ్‌లు, 2 రిజర్వాయర్లు, ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్‌ను కేసీఆర్ పరిశీలించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరంపై రేపు ఉదయం 10...

Pages

Don't Miss