Tuesday, February 27, 2018 - 20:01

పెద్దపల్లి : సీఎం కేసీఆర్ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. అంతర్గాం మండలం మూర్‌మూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ పథకం పూర్తి అయితే అంతర్గాం, పాలకుర్తి మండల పరిధిలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు...

Tuesday, February 27, 2018 - 08:36

పెద్దపల్లి : నేడు తెలంగాణ సీఎం పెదపల్లి సింగరేణి ఏరియాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా సభకు హాజరుకావాడానికి యాజమాన్యం కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. సెలవు కారణంగా సింగరేణికిపై రూ.10 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అలాగే ఉత్పత్తి పరంగా మరో రూ.5 కోట్ల నష్టం రానుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

Monday, February 26, 2018 - 15:55

పెద్దపల్లి : కౌలు రైతులకు పంట పెట్టుబడి ఇవ్వలేమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. పెద్దపల్లి జిల్లాలో రైతు సమన్వయ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొని దిశా..నిర్ధేశం చేశారు. రైతులను రక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, పామాయిల్ రైతులకు కూడా పంట పెట్టుబడి అందిస్తామన్నారు. పంట పెట్టుబడి అనేది రైతు, కౌలుదారుడు చూసుకుంటారని తెలిపారు. పాత కరీంనగర్ జిల్లాలో ఆగస్టు,...

Wednesday, February 21, 2018 - 14:29

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదని చెప్పుకుంటున్న గొర్రెల పంపిణీ పథకం దారి తప్పుతోంది. వివిధ రాష్ట్రాలు..ప్రాంతాల నుండి గొర్రెలను తీసుకొచ్చి రైతులకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఈ గొర్రెలపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. సబ్సిడీ గొర్రెలను తరలిస్తూ పలువురు పట్టుబడిన ఘటనలు దాఖలయ్యాయి కూడా.

...

Saturday, February 17, 2018 - 13:41

పెద్దపల్లి : మారుమూల అటవీప్రాంతంలో గ్రామగ్రామాన తిరిగి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు మంథని ఎమ్మెల్యే పుట్ట మధు. అభివృద్ధికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో విద్య, వైద్య సదుపాయాలను అందించడంతో పాటు సొంత ఖర్చులతో పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ద్వారా ఆకలి తీర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్నారు.

Saturday, February 17, 2018 - 11:47

పెద్దపల్లి : జిల్లా కాల్వశ్రీ రాంపూర్‌ మండలం కునారం గ్రామంలో భూములు లేని నిరుపేదలు నిజాం కాలం నాటి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. 2వేల ఎకరాల పైచిలుకు నిజాం భూములను పెత్తం దారులు, పలుకుబడి ఉన్నవారంతా ఆక్రమించుకోవడంతో భూములు కోల్పోయిన వారంతా పోరు బాట పట్టారు. ఏళ్ల తరబడి అక్రమార్కులు చేతుల్లో కబ్జాకు గురైన తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం ఆగదంటున్నారు.

Friday, February 16, 2018 - 18:09

పెద్దపల్లి : జిల్లాలోని కాల్వశ్రీ రాంపూర్‌ మండలం కునారం గ్రామంలో భూములు లేని నిరుపేదలు నిజాం కాలం నాటి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. సర్వే నం.18 లో 2వేల ఎకరాల భూములు అన్యక్రాంతం అయ్యాయి. 2వేల ఎకరాల పైచిలుకు నిజాం భూములను పెత్తం దారులు, పలుకుబడి ఉన్నవారంతా ఆక్రమించుకోవడంతో భూములు కోల్పోయిన వారంతా పోరు బాట పట్టారు. 9 నెలలుగా భూముల కోసం గ్రామస్థులు పోరాటం చేస్తున్నారు. వేలాది...

Friday, February 16, 2018 - 12:35

పెద్దపల్లి : ఫిర్యాదు దారుల నుండి బాధ్యతగా వ్యవహరించాలి..వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈ ఘటన చూపిస్తోంది. గోదావరిఖని వన్ టౌన్ సీఐ కృష్ణ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏసీపీ అపూర్వ నివేదిక రూపొందించారు. దీనితో రామగుండం కమిషనర్ చర్యలు...

Friday, February 16, 2018 - 11:49

పెద్దపల్లి : కూతురిపై అత్యాచారం జరిపిన వారు విడుదలయ్యారని...ఈ కేసుపై ప్రశ్నించడానికి వెళితే సీఐ దూషించాడని...కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని..

తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించడం..దళిత సంఘాలు ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని బాపూజీ నగర్ లో చోటు చేసుకుంది.

గత...

Pages

Don't Miss