Friday, November 16, 2018 - 20:38

హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన దగ్గర్నుంచి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా  పుడ్లూరు మండలం చన్గోముల్ వద్ద  హైదరాబాద్ నుంచి వికారాబాదుకు  కారులో తరలిస్తున్న 3 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఆదర్శ్ బ్యాంకుచెందినదిగా  అనుమానిస్తున్నారు. ఐతే నగదు రవాణా చేస్తున్న...

Tuesday, November 6, 2018 - 10:39

వికారాబాద్ : పరిగి మండలంలో దారుణం చోటుచేసుకుంది.  ఎన్నికల వేళ సుల్తాన్ పూర్ లో టీఆర్ఎస్ నాయుడు హత్య కలకలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ నాయుకుడు నారాయణ రెడ్డిపై  దుండగులు రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఉదయం పాలు పోయటానికి వెళ్లిన నారాయణరెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడి నుండి తప్పించుకునేందుకు నారాయణ రెడ్డి కొద్ది దూరం పరుగెత్తుకెళ్లగా...

Tuesday, September 25, 2018 - 09:37

వికారాబాద్ : గత కొంత కాలంగా స్టూడెంట్స్ సూసైట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. కారణాలు ఏమైనాగానీ విద్యార్థుల ఆత్మహత్యలపై మానసిక విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో ఓ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. గౌతమి జూనియర్ కాలేజ్‌లో బైపీసీ మొదటి సంవత్సరం చదవువుతున్న మనీష అనే విద్యార్థిని హాస్టల్ భవనంపై నుండి మృతి...

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Tuesday, August 21, 2018 - 17:44

వికారాబాద్ : శంషాబాద్‌ మండలం నాగర్‌గూడ వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీక్‌ అయ్యింది. రోడ్డుపై భారీ ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Wednesday, August 15, 2018 - 13:30

వికారాబాద్ : పూడూరు మండలం చీలాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయం పొలం వద్ద స్తంభానికి ఉన్న ఎర్తింగ్ వైర్ తగిలి విద్యుత్ షాక్ తో కృష్ణయ్య అనే రైతు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Pages

Don't Miss