Sunday, November 20, 2016 - 21:26

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా...

Thursday, November 17, 2016 - 14:00

వికారాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 32వ రోజుకు చేరుకుంది. 800 కిమీ. పూర్తి చేసుకుంది. ప్రజల నుంచి పాదయాత్ర బృందానికి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్ర బృంద సభ్యులు రాజుతో టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లాలోని కరువు నివారణకు, వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాదయాత్ర బృంద సభ్యులు రాజు డిమాండ్‌ చేశారు. వికారాబాద్‌ జిల్లాలో జీసీసీని ఏర్పాటు చేసి.....

Wednesday, November 16, 2016 - 17:56

వికారాబాద్ : బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధనే లక్ష్యంగా సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర 31వ రోజు కొనసాగుతోంది. ఓబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ..సంచార జీవితం గడుపుతున్నవారికి కుల సర్టిఫికెట్లు కూడా లేవన్నారు. అందుకనే వీరికి సంక్షేమపథకాలు అమలు జరపటంలేదన్నారు. వారికి అన్నిరకాల గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

Wednesday, November 16, 2016 - 13:51

వికారాబాద్ : సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి కోసం సీసీఎం మహాజన పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర 31 వ రోజుకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్ని వర్గాల నుంచి పాదయాత్ర బృందానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందం సభ్యుడు నగేష్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. దళితుల స్మశాన వాటికలు కబ్జాకు...

Wednesday, November 16, 2016 - 10:11

వికారాబాద్ : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న.. సీపీఎం మహాజన పాదయాత్ర నెలరోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికి పాదయాత్ర బృందం దాదాపు 760 కిలోమీటర్లు పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకుంది. అడుగడుగునా పాదయాత్ర బృందానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. 30వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర.. పెద్దేముల్‌ మండలంలో మొంబాపూర్‌ లో ప్రారంభమైంది. కందవెల్లి, కోకూరు,...

Tuesday, November 15, 2016 - 17:49

వికారాబాద్ : విద్య, వైద్య సదుపాయాలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో జరిగిన సీపీఎం పాదయాత్రలో పాల్గొన్న ఆయన సంఘీభావం తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో ప్రవైటీకరణను అడ్డుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అ సందర్భంగా ప్రొ.కోదండరామ్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీపీఎం పాదయాత్రకు పలుపార్టీలు,...

Tuesday, November 15, 2016 - 14:03

వికారాబాద్ : సీపీఎం మహాజన పాదయాత్ర 30వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈమేరకు టెన్ టివితో గిరిజన విద్యార్థి సంఘం నేత శోభన్ నాయక్ మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తానన్న ఎన్నికల హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందని గిరిజన విద్యార్థి సంఘం నేత శోభన్ నాయక్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Tuesday, November 15, 2016 - 10:41

వికారాబాద్ : సీపీఎం, టీ.టీడీపీ చేపట్టిన పాదయాత్రలపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. సీపీఎం మహాజన పాదయాత్ర 29వ రోజు పూర్తి చేసుకుంది. వికారాబాద్‌ జిల్లాలో కొనసాగుతోన్న పాదయాత్రకు అడుగుడుగునా జనాలు నీరాజనాలందిస్తున్నారు. అన్ని...

Monday, November 14, 2016 - 14:03

వికారాబాద్ : సీపీఎం చేపట్టిన 'మహాపాదయాత్ర'కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇవాళ్టితో పాదయాత్ర 29వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదని ఎంబిసి నేత ఆశయ్య అన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆశయ్య తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు గంగిరెద్దుల్లా ప్రభుత్వంపై...

Monday, November 14, 2016 - 13:59

వికారాబాద్ : సీపీఎం, టీ.టీడీపీ చేపట్టిన పాదయాత్రలపై తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్యలపై సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రతిపక్షాలపై అర్థరహిత...

Pages

Don't Miss