Sunday, November 13, 2016 - 14:00

వికారాబాద్ : తెలంగాణ రాష్ర్ట సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం తెలంగాణలో సీపీఎం చేపట్టిన 'మహాజన పాదయాత్ర' 28వ రోజుకు చేరుకుంది. అన్ని వర్గాల నుంచి పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. పరిగి, చిట్టెంపల్లి, వికారాబాద్‌ గుండా పాదయాత్ర సాగుతోంది. ప్రజలు తమ సమస్యలను సీపీఎం పాదయాత్ర బృందానికి చెప్పుకుంటున్నారు. ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజల నుంచి విశేష స్పందన...

Sunday, November 13, 2016 - 11:29

వికారాబాద్ : ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లని, కాకి లెక్కలు చెబుతూ తెలంగాణ అభివృద్ధిని చూపడం కాదని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజలు కనీస అవసరాల కోసం పరితపిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు బతుకు తెలంగాణ కోరుతున్నారు తప్ప బంగారు తెలంగాణ కాదని తమ్మినేని అన్నారు. వక్ఫ్‌ భూముల్ని కాపాడాలని సీఎం కేసీఆర్‌కు...

Saturday, November 12, 2016 - 13:54

వికారాబాద్ : సీపీఎం మహాజనపాదయాత్ర 27వ రోజుకు చేరింది.. వికారాబాద్‌ జిల్లాలో సీపీఎం బృందం పర్యటిస్తోంది.. పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు భాస్కర్‌ అందిస్తారు..ఈ సందర్భంగా వృత్తిదారుల సంఘం నేత రమణ మాట్లాడుతూ..వృత్తిదార్లందరూ స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా చేనేత కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్నారు. స్వంత రాష్ట్రం వచ్చిన తరువాత తమ బాగుపడతాయని...

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Sunday, November 6, 2016 - 09:36

వికారాబాద్ : పేదరికం, కుష్టురోగంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని 60 కిలోమీటర్ల దూరం తోపుడుబండిపై తోసుకెళ్లిన ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత అనే మహిళ హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తోపుడుబండిపై హైదరాబాద్‌ నుంచి రాములు భార్య మృతదేహాన్ని వికారాబాద్‌ తీసుకెళ్ళాడు. దారిలో గుర్తించిన స్థానికులు పోలీసులకు...

Thursday, November 3, 2016 - 17:51

వికారాబాద్ : తాండూరు మున్సిపల్ చైర్మన్‌ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఒప్పందం ప్రకారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజీనామా చేస్తారా? ఒకవేళ చేస్తే ఎంఐఎం నుంచి ఎవరు బరిలోఉన్నారు? చివరినిమిషంలో కాంగ్రెస్‌ పైచేయి సాధించే అవకాశముందా? ప్రత్యేక కథనం..

31వార్డు కౌన్సిలర్ల ...

Saturday, October 29, 2016 - 18:44

వికారాబాద్‌ : జిల్లాలోని లగచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. స్నానం కోసం వెళ్లిన బాలురు సందీప్ గౌడ్‌, సంపత్‌లు ఈతరాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. బట్టలు ఉతకడానికి అక్కడికి వచ్చిన భార్గవి అనే మహిళ ..బాలురను రక్షించడానికి ప్రయత్నించి..వారితో పాటు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Pages

Don't Miss