Wednesday, February 21, 2018 - 09:10

వనపర్తి : జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Wednesday, January 24, 2018 - 13:56
Wednesday, January 24, 2018 - 13:03

వనపర్తి : జిల్లాలో ఎత్తుపెరగాలన్న కోరిక ఓ యువకుడిని బలితీసుకుంది. బసవన్నగడ్డకు చెందిన ఖాజీ నజీర్‌ అహ్మద్‌ కురచగా ఉండేవాడు. ఎత్తుపెరగాలన్న కోరిక అతడిలో బలంగా నాటుకుపోయింది. తమ మందులు వాడితే ఎత్తుపెరుగుతారన్న టీవీ ప్రకటన చూసిన నజీర్‌... వెంటనే ఆర్డర్‌ ఇచ్చాడు. రెండు నెలలుగా ఆ మందులు వాడుతున్నాడు. అయితే మందులు వికటించి వాంతులు, విరోచనాలతో మంచం పట్టాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు....

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Saturday, January 13, 2018 - 12:16

వనపర్తి : ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ... వారధిగా పనిచేస్తున్న ఏకైక ఛానల్‌ 10టీవీ అని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. ప్రజాసమస్యలను వెలుగుతీయడంలో 10టీవీ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందన్నారు. సామాన్యుల బాధలు, కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ... ఆ సమస్యల పరిష్కారానికి తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. వనపర్తి జిల్లా పెబ్బేర్‌లో 10టీవీ...

Friday, January 5, 2018 - 21:18

వనపర్తి : ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూయిస్తుందన్నారు ఎమ్మెల్యే చిన్నారెడ్డి. వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపంలోని రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఎమ్మెల్యే చిన్నారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ మద్దతు తెలిపారు. రైతుల ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం...

Pages

Don't Miss