Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Friday, October 13, 2017 - 09:21

 

వనపర్తి : జిల్లా జాగృతి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న శివశాంతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివశాంతి హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Friday, October 13, 2017 - 09:13

వనపర్తి/ కృష్ణా : రోజు రోజుకు విద్యార్థుల బలన్మరణాలు పెరగుతున్నాయి. వీరి మరణానికి కాలేజీల వేధింపులేనా లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్నో అశలతో తల్లిండ్రులు తమ పిల్లలను చదుకొమ్మని పంపిస్తున్నారు. కానీ వారు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నిడమానూరు చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య...

Wednesday, October 11, 2017 - 15:30

వనపర్తి : జిల్లా నూతన కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు ఉపముఖ్యమంత్రి మహముద్‌ అలీ భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం వనపర్తి మండలంలోని పెద్దగూడెం, అప్పాయిపల్లి గ్రామాలలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానికి ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

 

Thursday, September 28, 2017 - 20:29

హైదరాబాద్ : వనపర్తిలో తడిసిన మొక్కజొన్నలకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వనపర్తి మార్కెట్‌ ఏర్పడ్డ ఈ సమస్యను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. వనపర్తిలో 2 రోజుగా కురిసిన వర్షాలకు తడిసిన పంటలకు మొక్కజొన్న బాగా తడిచిపోయింది. దీంతో రైతులు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో సమస్యను సానుభూతితో పరిష్కరించాలని.. జేసీని మంత్రి ఆదేశించారు. 

Thursday, September 28, 2017 - 20:13

వనపర్తి : తడిసిన మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని వనపర్తిలో రైతులు మార్కెట్‌ యార్డు ముందు ఆందోళనకు దిగారు. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో పురుగుల మందు తాగి చనిపోతామని ఆందోళన చేశారు. పోలీసులు రైతుల వద్ద నుండి పురుగుల మందును లాక్కొని సంబంధిత అధికారులను పిలిపించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వాగ్దానం చేయడంతో ఆందోళన విరమించుకున్నారు. 

Wednesday, September 27, 2017 - 16:42

వనపర్తి : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఘనపూర్‌ మండలం మానాజిపేటలోని దర్గా సమీపంలో పిడుగుపాటుకు పెద్దమందడి మండలం జంగమాయపల్లికి చెందిన రాములు, మానాజీపేటకు చెందిన కృష్ణయ్య, సొహైల్ మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి మృతితో తోటి భక్తులు కంటతడిపెట్టారు. మృతుల కుటుంబ సభ్యులు,...

Pages

Don't Miss