Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Friday, June 16, 2017 - 15:47

వనపర్తి :జిల్లాలో పిడుగుపడి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆత్మకూరు మండలం బాలకృష్ణాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పొయ్యిలో కట్టెలకోసం పొలాల్లోకి వెళ్లిన వారిపై పిడుగు పడ్డంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. 

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, June 1, 2017 - 10:35

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...

Saturday, May 13, 2017 - 06:47

వనపర్తి : కొత్తకోట మండలం పాలెం జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు మోజెర్ల గ్రామానికి చెందిన రాములు, బాల్‌రెడ్డిగా గుర్తించారు. మరో వ్యక్తి రామకృష్ణకు తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

 

Wednesday, April 19, 2017 - 08:13

వనపర్తి : జిల్లా కేంద్రమైన వనపర్తి నేటికీ రూపురేఖలు మారలేదు. జిల్లా ఏర్పాటుతో అభివృద్ధి ఊపందుకుంటుందని భావించిన ప్రజల ఆశలు అడియాశలుగానే మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెలకొన్న పరిస్థితులే నేటికి దర్శనమిస్తున్నాయి. పాలకులు మారుతున్నా, పట్టణాలు మారుతున్నా, రాష్ట్రాలు ఏర్పడినా, జిల్లా కేంద్రమైనా వనపర్తి అభివృద్ధికి అమడదూరంలోనే ఉంది. అభివృద్ధికి కొలమానం రోడ్ల విస్తరణ.. ఇంత...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Wednesday, March 1, 2017 - 20:47

Pages

Don't Miss