Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Tuesday, August 21, 2018 - 13:37

అసిఫాబాద్ : ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాబందులు సైతం విలవిల్లాడుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా  పెంచికల్‌ మండలం మేరిగూడ అటవీ ప్రాంతంలో వర్షానికి ఓ రాబందు అస్వస్థతకు గురైంది. ఇది గమనించి ఫారెస్ట్‌ అధికారులు పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలో చికిత్స చేయించారు.  నందిగామ గ్రామ సమీపంలోని పాలరాపుగుట్టలోని రాబందుల ఆవాసం ఉంది. అక్కడి రాబందులు వర్షాలకు తట్టుకోలేక...

Thursday, August 16, 2018 - 20:58

అసిఫాబాద్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. కుమ్రంబీం అసిఫాబాద్ జిల్లా దహేంగాం మండలం గెర్రే గ్రామం వద్ద ఎర్రవాగు పొంగిపొర్లడంతో ఓ గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జిపైకి గర్బిణిని ఓ మంచానికి తాళ్లు చేర్చాల్సి వచ్చింది. 

Thursday, August 16, 2018 - 20:13

కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. సిర్పూర్ కాగజ్‌నగర్‌, కౌటాల, బెజ్జూర్‌, దహేగాం, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్ మండలాలలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది, పెనుగంగా నది, పెద్దవాగులలోకి భారీగా  వరదనీరు చేరుతుంది. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి...

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Sunday, August 12, 2018 - 13:06

ఆసిఫాబాద్ : ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతులలో ముందవరుసలో ఉన్న పక్షిజాతి రాబందులు అంతరించిపోతున్నాయి. ఈ అరుదైన రాబందుల ఉనికి తెలంగాణ ప్రాంతంలోని పాలరాపుగుట్ట పై ఉండటంతో వాటి సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాన్ని "వన్యప్రాణి సంరక్షణ కేంద్రం"గా ప్రకటించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది తెలంగాణ ఆటవీ శాఖ. "జటాయు" పేరుతో ఇక్కడ కేంద్రాన్ని...

Sunday, August 12, 2018 - 11:59

అసిఫాబాద్ : ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలో  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొమురం భీం...

Thursday, August 2, 2018 - 21:37

అసిఫాబాద్ : సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు నాలుగేళ్లుగా మూతపడిన సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
అసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన 
కోమ్రం భీం అసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్ పేపర్‌...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Thursday, July 12, 2018 - 12:51

ఆసిఫాబాద్ : చినుకు పడిందంటే చాలు ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన గూడాలు, మారుమూల పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అలాంటిది 5 రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా జనజీవనం స్థంబించిపోయింది. గ్రామాలన్నీ వరద నీటితో జలమయం అయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

ఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొమ్రం భీం ఆసిఫాబాద్...

Pages

Don't Miss