Thursday, July 12, 2018 - 11:27

ఆసిఫాబాద్ : జిల్లాలో జైనూర్ లో ఎమ్మెల్యే కోనా లక్ష్మీ పర్యటించారు. వర్షంలోనూ ఎమ్మెల్యే కోనా లక్ష్మీ పలు కాలనీలను సందర్శించారు. కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె అన్నారు. 

 

Thursday, July 12, 2018 - 10:36

కొమ్రం భీం అసిఫాబాద్‌ : జిల్లాలో 5 రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ ఫ్లో 35000 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 13వేల 376 క్యూసెక్కులుగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Saturday, July 7, 2018 - 15:25

ఆసిఫాబాద్‌ : వెనకబడిన ప్రాంతాలలో అత్యంత ముందు వరసలో ఉండే ప్రాంతం అది. గిరిజనుల సౌకర్యం మెరుగు పడాలని ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. కాని ఆ ప్రాంతంలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడడం లేదు. ఇతర ప్రాంతాల నుండి బదిలీలు జరిగినా ఈ ప్రాంతంలో పని చేసేందుకు ఇష్టంలేక విధుల్లో చేరడం లేదు. 
గాడి తప్పుతున్న పాలన 
కొమురంభీం ఆసిఫాబాద్‌...

Wednesday, July 4, 2018 - 11:30

కొమరం భీం : సాలెంగూడ గ్రామం భయపడుతోంది. ఓ వ్యక్తి హల్ చల్ తో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చేతిలో గొడ్డలి పట్టుకుని భయపెడుతున్నాడు. తాను చెప్పినట్లు నడుచుకోవాలని..లేనిపక్షంలో గొడ్డలితో నరికేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. ఆదివారం ఓ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. గ్రామ పెద్దలపై కూడా దాడికి యత్నించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి...

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Sunday, June 24, 2018 - 12:59

కొమరం భీం : ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలల తలుపులు తెరుచుకోలేదు. అయినా విద్యాశాఖాధికారులు మౌనంగానే ఉండిపోయారు. కానీ.. ఒక పోలీసు అధికారి విద్యార్ధులకు విద్యను అందించాలని పట్టుపట్టాడు. టీచర్లు, స్థానికులతో మాట్లాడి ఏకంగా 30 పాఠశాలలను తెరిపించాడు. పోలీసు అధికారి స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుమురం భీం...

Monday, June 11, 2018 - 06:38

ఆసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ మండలం శివపూర్‌లో వర్షాల కోసం గ్రామదేవతకు గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు విస్తారంగ కురిసి, పాడిపంటలు సంమృద్ధిగా పండాలని కోరతూ.. బోనాలు సమర్పించారు. ఇలా ప్రతి సంవత్సరం వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించడం తమ ఆనవాయితీ అని గ్రామస్థులు అన్నారు.

Friday, June 8, 2018 - 16:38

కొమురం భీం : సోనాపూర్‌లో ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉనికిని ప్రమాదంలోకి నెడుతుంది సింగరేణి సంస్థ. నష్ట పరిహారం ఇవ్వకుండా ఆదివాసీల భూములను ప్రజాప్రతినిధులు, అధికారులు సింగరేణి సంస్థకు దౌర్జన్యంగా కట్టబెట్టారు. ఆదివాసీలకు వచ్చిన నష్టపరిహారాన్ని తమ బ్యాంక్ అకౌంట్లలో వేసుకున్న ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఎవ్వరి దగ్గరికి...

Thursday, June 7, 2018 - 19:52

ఆసిఫాబాద్‌ : ఎజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని అనుసరిస్తూ... తమ గ్రామాల్లో స్వయం పాలన సాగిస్తున్నామంటున్నారు ఆదివాసులు.  జూన్‌ 2నుంచి ఆదివాసులు లంబాడ తెగకు చెందిన ఉద్యోగులను ఏజెన్సీ గ్రామల్లో అనుమతించడంలేదు. స్వయం పాలన ప్రకటించి, లంబాడాలను అడ్డుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని ఆదివాసులంటున్నారు. ఊరి చివరిలో మావనాటే మావరాజ్‌, 'మావేనాటే.. మావే సర్కార్‌' అనే...

Thursday, June 7, 2018 - 19:47

ఆసిఫాబాద్‌ : జిల్లా రెబ్బెన మండలం కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డులో వాటర్‌ పైప్‌లైన్‌ పగిలింది. మిషన్‌ భగీరథ పైప్‌ పగలడంతో భారీ ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. పైప్‌లైన్‌ రోడ్డుకు పక్కనే ఉండడంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. నీరు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులంటున్నారు. 

 

Pages

Don't Miss