Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Tuesday, April 10, 2018 - 18:38

కొమురంభీం : అడవుల్లో అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. ఆదివాసీలను అరణ్యాలకు దూరం చేస్తున్నారు. ప్రభుత్వం సౌకర్యాలు, వసతులు కల్పించకపోయిన కన్నతల్లిలాంటి అడవులను నమ్ముకొని జీవస్తున్న అడవి బిడ్డలపై అటవీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. వాగులు, చెలిమలు ఎండి పోవడంతో పిల్లజల్లతో కలసి కొండలు దాటుకుంటూ నీళ్ల కోసం వెళుతున్నారు. తిరిగి తమ గూడాలకు చేరుకునే సరికి అక్కడ అటవీ అధికారులు,...

Sunday, April 1, 2018 - 20:26

కుమురంభీం ఆసిఫాబాద్ : ఎన్న చట్టాలు వచ్చినా... ఎన్ని ప్రభుత్వాలు మారినా.. దళితుల బతుకుల్లో మార్పు రావడం లేదు... వారి పట్ల వివక్ష మారడం లేదు. తక్కువ జాతి అని వారిపై వివక్షలు కొనసాగుతూనే  ఉన్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దళితులను దూరం పెడుతున్న అగ్రవర్ణాల పై స్పెషల్ స్టోరీ... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసిఫాబాద్ మండలం బూరుగూడ గ్రామంలో...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Saturday, February 24, 2018 - 12:05

ఆసిఫాబాద్ : ఇంటర్‌నెట్‌ యుగంలోనూ లెటర్‌ అందని ఇంటిని ఒక్కటైనా చూశారా... కానీ శుభవార్త, దుర్వార్త, ఉద్యోగ నియామకం, ఇన్సూరెన్స్‌ డబ్బులు, భూముల దస్తావేజులు ఇలాంటి పత్రాలేవైనా సరే... పోస్ట్‌ ద్వారా అందుకోలేని చీకటి యుగంలో ఉన్నారు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంట గ్రామస్థులు. గత మూడేళ్ళుగా తపాలా ద్వారా ఎలాంటి సమాచారం అందుకోలేని చీకటియుగంలో బతుకుతున్నారు వారంతా. గత...

Saturday, February 3, 2018 - 19:44

కొమ్రం భీం అసిఫాబాద్ : జిల్లాలో మొన్న జరిగిన దళిత మహిళ సావంత్‌ భాయ్‌ హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వతీరును నిరసిస్తూ... ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద టీమాస్‌ నేతలు నిరసన తెలిపారు. జనవరి 31న మర్తిడి గ్రామంలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పటించారని.. వారు అధికార పక్షంకి చెందిన...

Wednesday, January 31, 2018 - 17:51

అసిఫాబాద్ : పేదలను ఆదుకోవడంలో ఆ ప్రజాప్రతినిధి అందరికంటే ముందుంటారు. నిస్సహాయకులను సాయం చేయడంలో ఆయనది పెద్దచేయి. కరవు రోజుల్లో గిరిజన గూడేల్లో అంబలి కేంద్రాలు తెరిచి ఆదుకున్న ఆ ఎమ్మెల్యే...  ఇప్పుడు 58 గిరిజన జంటలకు సొంత ఖర్చులతో సామూహిక వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

ఈయన పేరు కోనేరు కోనప్ప. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. పేదలకు...

Wednesday, January 31, 2018 - 17:11

కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ మహిళా అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. బెజ్జూరు మండలం మర్తిడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన స్రవంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే.. తనపై స్థానిక నేతలు ముగ్గురు కిరోసిన్‌ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ...

Pages

Don't Miss