Wednesday, September 13, 2017 - 12:58

కోమరంభీమ్ అసిఫాబాద్ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాగజ్‌నగర్‌, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్‌, దహేగాం, బెజ్జూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండే కొన్ని గ్రామాలలో.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. ఆందోళనకు గురైన రైతన్నకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది. 

Sunday, September 10, 2017 - 20:22

అసిఫాబాద్ : జిల్లా లింగాపూర్ మండలంలో విషాదం నెలకొంది. సప్తగుండం జలపాతంలో ఈతకెళ్లి 13 ఏళ్ల బాలుడు జాదవ్ సురేష్ గల్లంతయ్యాడు. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ ఇంతవరకు బాలుడు దొరకలేదు. మరింత సమాచారం కోసం వీడయో చూడండి.

 

Friday, September 8, 2017 - 20:22

అసిఫాబాద్ : నమస్తే..! మంచిగుండ్రా.. నా పేరు ఉడత దేవక్క... కొమ్రంభీం జిల్లా... బోరంపల్లి మా ఊరు. మేం గరీబోళ్లం... నాకు లగ్గం జేసేటందుకు ... మా అమ్మ, బాపు దగ్గర పైసల్‌ లేకుండె. ఏం చేయాలో తెలియక పరేషాన్‌ అయ్యేటోళ్లు. అట్లాటప్పుడు మీరు కల్యాణ లక్ష్మి స్కీం తెచ్చిండ్రు. దోస్త్‌లు జెబితే వోయి..దరఖాస్తు పెట్టినం.. లగ్గం టైమ్‌కి పైసలొస్తాయని మాబాపు.. నా పెళ్లి పని షురూ చేసిండ్రు......

Friday, September 8, 2017 - 20:05

అసిఫాబాద్ : కొమురం భీమ్‌ జిల్లాలోని దహేగాం ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి అజయ్‌ని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో అజయ్‌ వీపుపై వాతలు తేలాయి. ఉపాధ్యాయుడు రవిపై.. అజయ్‌ తల్లిదండ్రులు తహశీల్దార్‌, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. 

Thursday, August 24, 2017 - 15:38

కోమరంభీమ్ అసిఫాబాద్‌ : జిల్లా, చింతలమానేపల్లి మండలం, గూడెం గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిపై అంతర్‌రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణాన్ని గతేడాది ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం 53 కోట్లతో వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ వంతెన పూర్తైతే అక్కడి గిరిజనులకు, మహారాష్ట్రలోని అహెరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. సరిహద్దు మారుమూల ప్రాంతమైన సిర్పూర్‌ నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలకు రవాణా...

Friday, August 18, 2017 - 07:46

కొమరంభీం :కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండంలం ఈస్‌గాం లో మట్టిగణపతులు కనువిందు చేస్తున్నారు. చెరువు మట్టి, సహజరంగులతో పర్యావరణ హిత గణపతి విగ్రహాలను కొనడానికి స్థానికులు ఉత్సహపడుతున్నారు. ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్‌ తో తయారయ్యే విగ్రహాలు పర్యవరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో ఈజ్‌గాంలో తయారవుతున్న మట్టిగణపతులకు డిమాండ్‌ పెరిగింది. ప్రజల్లో వస్తున్న చైతన్యానికి ఇది...

Tuesday, August 15, 2017 - 07:40

కోమరంభీం : హరితహారం పేరుతో కేసీఆర్‌ సర్కార్‌ గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకోబోమని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య హెచ్చరించారు. పోడు భూములను గుంజుకోవాలని చూస్తే పోరుబాట పడుతామన్నారు. కేసీఆర్‌ జేజమ్మ వచ్చినా గిరిజనుల భూమిని ఒక్క అంగుళం కూడా తీసుకోలేరని తేల్చి చెప్పారు. కోమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో జరిగిన ఆదివాసీ దినోత్సవ వారోత్సవ ముగింపు వేడుకలకు సున్నం రాజయ్య...

Tuesday, July 25, 2017 - 20:19

ఆదిలాబాద్ : అవి గిరిజన పల్లెలు. పచ్చని చేలు.. జల జల జారే జలపాతాలు.. అందమైన అడవి.. స్వచ్ఛమైన సంస్కృతికి నిలువెత్తు రూపాలు. వాళ్లకు మోసపోవడం తప్ప, మోసం చేయడం అంటే ఏంటో తెలీదు. వ్యవసాయం, అడవి తల్లే జీవనాధారంగా తరతరాల సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ఓపెన్‌ కాస్ట్‌ పేరుతో.. గిరి పుత్రుల జీవితాలలో అలజడిని, అశాంతిని రాజేస్తున్నాయి. దీనిపై 10టీవీ ప్రత్యేక...

Tuesday, July 18, 2017 - 13:37

ఆసిఫాబాద్ : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, దహేగాం, పెంచికల్‌ పేట మండలాల్లో భారీగా వానలు పడుతున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న పెనుగంగా నదికి వరదనీరు పోటెత్తుతోంది. అటు ఆసిఫాబాద్‌ తిర్యాణి, కెరామెరి మండలాల్లోనూ జోరు వానలు కురుస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss