హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...
కోమరంభీం : కొమరంభీం జిల్లా కౌటాడ మండలం కేజీబీవీలో ఉదయం అల్పాహారంతిన్న 30మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.. ఇందులో కొందరు విద్యార్థినిల పరిస్థితి విషమంగాఉందని తెలుస్తోంది.. వీరికి సిర్పూర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. గత ఏడాదికూడా ఇక్కడ ఫుడ్‌పాయిజన్ అయి విద్యార్థినిలు అనారోగ్యానికి గురయ్యారు.
కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా చింతలమానేపల్లి మండలంలో.. విషాదం చోటు చేసుకుంది. బాలాజీ అనకోడ గ్రామంలో, పొలంలోని వ్యవసాయ బావిలో పడి.. ఏడేళ్ల వయస్సున్న బాలుడు మృతి చెందాడు. నిర్లక్ష్యానికి బాలుడి ప్రాణం బావిలో కలిసింది. ఆత్మరావు-పెంటక్క దంపతుల కుమారుడు గణేశ్.. తన తాత రామయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. గణేశ్ ఆడుకుంటుండటంతో.. అందరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఇంటికెళ్తానని...
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...
కాగజ్ నగర్ : అతనొక మామూలు స్కూల్ టీచర్. సమాజ సేవ చేయాలనే పట్టుదలతో.. అక్రమార్కులకు దడ పుట్టించాడు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌తో ప్రభుత్వ సొమ్మును.. ఏకంగా 20 కోట్లు రికవరీ చేయించాడు. తప్పుడు మెడికల్ బిల్లులతో ప్రభుత్వానికి టోపీ వేసిన అధికారుల గుట్టు రట్టు చేశాడు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ప్రభుత్వ టీచర్ పై 10...
ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...
అదిలాబాద: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా మంత్రి పాత్ర ప్రధానం. జిల్లాకు పెద్దన్న పాత్ర పోషించే మంత్రి లేకపోతే ఆ జిల్లా అభివృద్ధిని ఊహించలేం. కానీ తెలంగాణలో జిల్లాల విభజనతో మంత్రే కాదు ఇన్చార్జి మంత్రి కూడా కరువయ్యారు. ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించడంతో జోగురామన్న ఆదిలాబాద్‌కు, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌కు పరిమితమయ్యారు. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్...
హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...
ఆసిఫాబాద్ : జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఒకరికి బదులు పదో తరగతి పరీక్ష రాస్తున్న మరో బాలుడు అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కాగజ్‌నగర్‌కు చెందిన మహ్మద్ కరీం అనే విద్యార్థికి బదులు అదే ప్రాంతానికి చెందిన జహీర్..ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ తెలుగు రెండో పేపర్ పరీక్ష రాస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. ఇన్విజిలేటర్ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జహీర్‌ను అదుపులోకి...