Friday, September 29, 2017 - 14:38

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా భావించే సింగరేణి ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఆరోసారి జరుగుతున్న ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీజీబీకేఎస్ ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగ ప్రవేశం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు....

Wednesday, September 27, 2017 - 18:54

కొమురంభీం అసిఫాబాద్‌ : గ్రామీణ ప్రాంతాలలో కులమతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. కొమురంభీం అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ గ్రామపంచాయితీ సర్పంచ్‌ సయ్యద్‌ కీజర్‌ హుస్సేన్ తన సొంత ఖర్చుతో బతుకమ్మ జాతరను నిర్వహించారు. సిర్పూర్‌ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గ్రామంలోని వెయ్యి మందికి పైగా మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. సిర్పూర్‌...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Wednesday, September 13, 2017 - 12:58

కోమరంభీమ్ అసిఫాబాద్ : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కాగజ్‌నగర్‌, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్‌, దహేగాం, బెజ్జూరు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుండే కొన్ని గ్రామాలలో.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. ఆందోళనకు గురైన రైతన్నకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది. 

Sunday, September 10, 2017 - 20:22

అసిఫాబాద్ : జిల్లా లింగాపూర్ మండలంలో విషాదం నెలకొంది. సప్తగుండం జలపాతంలో ఈతకెళ్లి 13 ఏళ్ల బాలుడు జాదవ్ సురేష్ గల్లంతయ్యాడు. బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కానీ ఇంతవరకు బాలుడు దొరకలేదు. మరింత సమాచారం కోసం వీడయో చూడండి.

 

Friday, September 8, 2017 - 20:22

అసిఫాబాద్ : నమస్తే..! మంచిగుండ్రా.. నా పేరు ఉడత దేవక్క... కొమ్రంభీం జిల్లా... బోరంపల్లి మా ఊరు. మేం గరీబోళ్లం... నాకు లగ్గం జేసేటందుకు ... మా అమ్మ, బాపు దగ్గర పైసల్‌ లేకుండె. ఏం చేయాలో తెలియక పరేషాన్‌ అయ్యేటోళ్లు. అట్లాటప్పుడు మీరు కల్యాణ లక్ష్మి స్కీం తెచ్చిండ్రు. దోస్త్‌లు జెబితే వోయి..దరఖాస్తు పెట్టినం.. లగ్గం టైమ్‌కి పైసలొస్తాయని మాబాపు.. నా పెళ్లి పని షురూ చేసిండ్రు......

Friday, September 8, 2017 - 20:05

అసిఫాబాద్ : కొమురం భీమ్‌ జిల్లాలోని దహేగాం ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి అజయ్‌ని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో అజయ్‌ వీపుపై వాతలు తేలాయి. ఉపాధ్యాయుడు రవిపై.. అజయ్‌ తల్లిదండ్రులు తహశీల్దార్‌, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. 

Thursday, August 24, 2017 - 15:38

కోమరంభీమ్ అసిఫాబాద్‌ : జిల్లా, చింతలమానేపల్లి మండలం, గూడెం గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిపై అంతర్‌రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణాన్ని గతేడాది ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం 53 కోట్లతో వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ వంతెన పూర్తైతే అక్కడి గిరిజనులకు, మహారాష్ట్రలోని అహెరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. సరిహద్దు మారుమూల ప్రాంతమైన సిర్పూర్‌ నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలకు రవాణా...

Pages

Don't Miss