Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Saturday, July 7, 2018 - 13:22

జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా KTK ఒకటవ గని ఓపెన్‌ కాస్ట్‌లో వరద నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిపివేశారు. సుమారు మూడు వేల టన్నుల బొగ్గు తవ్వకానికి ఆటంకం ఏర్పడింది. రెండు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Sunday, June 24, 2018 - 12:56

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌...

Saturday, June 16, 2018 - 21:54

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలిమెల మండల వద్ద గల రోడ్డులో మూల మలుపు వద్ద పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tuesday, June 5, 2018 - 18:39

జయశంకర్‌ భూపాలపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అమాయక గిరిజనుల పై అటవీశాఖ అధికారులు దాడిచేసి చితక బాదిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలో గర్బిణీలు, చిన్నారులు అని చూడకుండా ఫారెస్ట్‌ అధికారులు దాడులు చేశారు. అటవీశాఖ అధికారుల తీరును గిరిజన సంఘాలు ఖండించాయి. మరోవైపు న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తమనే...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Friday, May 25, 2018 - 18:57

జయశంకర్‌ భూపాలపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని రెవెన్యూ అధికారులు నీరుగార్చారు. ములుగు గణపురం మండలంలో రైతుబంధు పథకం సక్రమంగా అమలు కావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. గత మూడు రోజులుగా తహశీల్దార్‌ ఆఫీస్‌కు రావడం లేదని ఆరోపిస్తున్నారు. తాము ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామంటున్నారు. కార్యాలయం వద్ద ఉదయం నుంచి పడిగాపులు గాస్తున్నామని వాపోయారు....

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Pages

Don't Miss