Monday, August 13, 2018 - 12:19

భూపాలపల్లి : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం ఏటూరునాగరం లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు, దయ్యాలవాగు,జీడివాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటి వరకు ఏజెన్సీలో 15 శాతం వర్షపాతం నమోదైంది. దీంతో చుట్టు పక్కల గ్రామాల రహదారులు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు...

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Sunday, August 12, 2018 - 17:10

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు డివిజన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బ్యారేజీలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీనితో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పలు ప్రాజెక్టులను సందర్శించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర వాటిని చూసేందుకు సంగారెడ్డి జిల్లాకు...

Saturday, July 28, 2018 - 10:02

కరీంనగర్ : నేటి నుండి ఆగస్ట్ 3 వరకు..మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించనున్నారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నక్సల్బరీ నాయకులు చర్మజుందార్, కానుసన్యాల్ అమరత్వానికి గుర్తుగా మావోయిస్టులు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ అయ్యారు.

అమరులైన మావోయిస్టుల నేతల...

Saturday, July 21, 2018 - 16:11

భూపాలపల్లి : కాళేశ్వరం దేవస్థానంలోని పార్వతి అమ్మవారి పట్టుచీర మాయమైంది. పాలక మండలి ఛైర్మన్‌ వెంకటేశం గుర్తించి.... ఆరా తీయగా  ఆలయ అధికారి వరంగల్‌కు వెళ్లి అదే చీరను పోలి ఉన్న మరో చీరను తెచ్చి చూపాడు. దీంతో ఘటనపై విచారణ జరిపితే అసలు బాగోతం బయటపడుతుందని స్థానికులు అంటున్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరుపుతామని కార్యనిర్వాహణాధికారి మారుతీ అన్నారు. 2016 మే 02న సీఎం కేసీఆర్‌...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Saturday, July 7, 2018 - 13:22

జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా KTK ఒకటవ గని ఓపెన్‌ కాస్ట్‌లో వరద నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిపివేశారు. సుమారు మూడు వేల టన్నుల బొగ్గు తవ్వకానికి ఆటంకం ఏర్పడింది. రెండు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Sunday, June 24, 2018 - 12:56

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌...

Saturday, June 16, 2018 - 21:54

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలిమెల మండల వద్ద గల రోడ్డులో మూల మలుపు వద్ద పెళ్లికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Pages

Don't Miss