Friday, January 12, 2018 - 14:08

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారంలో దారుణం చోటుచేసుకుంది. 501 సర్వే నెంబర్‌లోని భూ తగదాలతో ఇద్దరు వీఆర్‌ఏలపై సోదరి శ్రీను అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో దొడ్డు రాములు మృతి చెందగా.. బొడ్డు లక్ష్మణ్‌ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

 

Wednesday, January 10, 2018 - 17:45

 కరీంనగర్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు నిధుల గండం పొంచివుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం 5 వేల 600 కోట్ల రూపాలయ వ్యయంతో పునర్నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టు ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదు. అంచనా వ్యయంలో 74 శాతం పెట్టుబడికి వాటాలు పూర్తయ్యాయి. మిగిలిన 26 శాతం వాటా పెట్టుబడుల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రామగుండం...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Thursday, December 14, 2017 - 14:08

భూపాలపల్లి : జిల్లా మేడారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మేడారం ట్రస్ట్ బోర్డు పాలకవర్గ ప్రమాణస్వీకారాన్ని ఆదివాసీలు అడ్డుకున్నారు. మంత్రి చందులాల్ తనయుడు ప్రహ్లాద్ పై ఆదివాసీల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారంలో ట్రస్ట్ బోర్డులో లంబాడీల పెత్తనమేంటని ఆదివాసీలు నిలదీశారు. ప్రహ్లాద్ పై దాడికి యత్నం చేసి 15 కార్లను ధ్వంస చేశారు. దీంతో పోలీసులకు ఆదివాసీలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది....

Wednesday, December 6, 2017 - 22:25

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లా రెంగొండ మండలం గోరికొత్తపల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి రేష్మ అత్యాచారం, హత్య కేసులో నిందితుడు కనకం శివను పోలీసులు అరెస్టు చేశారు. శివని బహిరంగంగా ఉరి తేయాలని రేష్మ బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలో ఈనెల 4న శివ రేష్మను అత్యాచారం చేసి హత్య చేశాడు. శివ అన్న కుమార్ ప్రేమ విషయంలో రేష్మ తండ్రి రాజు...

Monday, December 4, 2017 - 19:14

భూపాలపల్లి : జిల్లాలో అత్యంత దారుణం జరిగింది. జిల్లాలోని రేగొండ మండలం గోరికొత్తపల్లిలో రేష్మ అనే చిన్నారి పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. రాజు, ప్రవళిక దంపతుల కూతురు రేష్మ నిన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్లి అదృశ్యమైంది. ఈ రోజు ఊరి పొలాల్లో ఆ చిన్నారి శవమై కనబడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి....

Monday, December 4, 2017 - 10:27

జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీలో వెలసిన మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఈనెల 2 నుంచి 8 వరకు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ... పీఎల్‌జీఏ..  వారోత్సవాలకు మవోయిస్టుల పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో  విజయపురి కాలనీ ప్రధాన రహదారిపై వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. హిందు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని  కోరారు. పోలీసుల ఏజెంట్లు, ఇన్ఫార్మర్లను...

Pages

Don't Miss