Friday, July 7, 2017 - 14:56

జయశంకర్‌ : జిల్లాలోని గుడ్‌మార్నింగ్‌ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్ధుల వద్ద నిషేధిత గుట్కాలు లభించడం కలకలం రేపుతోంది. ఓ విద్యార్ధి తోటి విద్యార్ధులకు గుట్కాలు ఇస్తుండగా ప్రిన్సిపాల్ మందలించారు. దాంతో భయపడిన మరో విద్యార్ధి దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతనిని 108లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

 

Friday, June 16, 2017 - 11:46

భూపాలపల్లి : వాసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ లక్ష్యంగా సింగరేణి కార్మికుల చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరింది. కార్మికులు సమ్మెతో భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బొగ్గ గనుల ప్రాంతంలో 144 సెక్షన్ విధించి పోలీసులను భారీగా మోహారించారు. ఈ సమ్మెలో ఒక్క సంఘం మినహా అన్ని సంఘాలు పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె వల్ల 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం...

Sunday, June 11, 2017 - 15:58

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అటవీప్రాంతంలో గిరిజన బాలికపై అత్యాచారం ఘటనలో 10టీవీ కథనానికి పోలీసులు స్పందించారు. భారత్‌దేశ్‌ బేస్‌ క్యాంప్‌నకు చెందిన విజయ్‌ కుమార్, సంతోష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అడవిలో ఎర్రచీమలను పట్టుకునేందుకు వెళ్లిన గిరిజన యువతిపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఐపీసీ 366,...

Sunday, June 11, 2017 - 15:30

భూపాలపల్లి : జిల్లా తడ్వాయి మండలం ముసలమ్మపేట లో గిరిజన బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10టీవీ వరుస కథనాలతో జిల్లా యంత్రంగం స్పందించింది. భారత్ దేశ్ క్యాంప్ నకు చెందిన విజయ్, సంతోష్ లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. టెన్ టివి సామాజిక బాధ్యతతో గిరిజన అడవుల్లో జరిగిన ఘోరాన్ని టెన్ టివి బయటపెట్టింది. కథనాలతో జిల్లా కలెక్టర్...

Saturday, June 10, 2017 - 16:16

భూపాలలపల్లి : ఉదయం నుంచి టెన్ టివిలో వరుస కథనలతో తాడ్వాయి మండలంలో సామూహిక అత్యాచారం ఘటనపై ఉన్నతధికారులు స్పందించారు. ఎస్పీ భాస్కర్ నిందితులపై కేసు నమోదుకు ఆదేశించారు. ఏటూరు నాగారం సీఐ ఆధ్వర్యంలో బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. ఫారెస్ట్ ఉద్యోగి సంతోష్, బీట్ ఆఫీసర్ కల్యాణి భర్త విజయ్ కుమార్ లను తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

Saturday, June 10, 2017 - 12:24

జయశంకర్ భూపాలపల్లి : దేశంలో ఎన్ని అత్యాచార నిరోధక చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఒక ఘటన మరిచిపోకముందే మరో ఘటన జరుగుతుంది. తాజాగా మేడారం అడవుల్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. చత్తీస్ గడ్ నుంచి వలసవచ్చిన గిరిజన కుటుంబం జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అడవుల్లోని ముసలమ్మపెంటలో నివాసముంటున్నారు. ముగ్గురు యువతులు...

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, June 1, 2017 - 10:35

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...

Thursday, May 11, 2017 - 06:57

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో జరుగుతున్న మేడిగడ్డ రిజర్వాయర్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాజెక్టు పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు ఎస్‌పీ సింగ్‌ చెబుతున్నారు.

Monday, April 24, 2017 - 15:32

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలం దేవునిగుట్టలో గిరిజనులపై పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని సీపీఎం ఖండించింది. పదిహేడేళ్లుగా అడవిలో ఉంటూ, భూములను సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమికొట్టడాన్ని తప్పుపట్టింది. 2006 అటవీ చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి, భూముల నుంచి తరిమికొడుతారా ? అని సీపీఎం తెలంగాణ...

Pages

Don't Miss