Thursday, October 5, 2017 - 17:38

భూపాలపల్లి : సొంత రాష్ట్రంలో ఆధిపత్య పోరును భరించలేక అటవి బాట పట్టి కాలం గడుపుదామని కొండ కోనల నడుమ గూడెం కట్టుకున్నారు. అడవి ఆదరిస్తే నాగరికులైన అధికారులు ఈ బక్క జీవులను తన్ని తరిమేస్తున్నారు. పదే పదే గొత్తికోయలను టార్గెట్ గా చేస్తూ నిర్దాక్షిణ్యంగా గూడేలపై బడి దాడులకు తెగబడుతున్నారు. చిన్న పిల్లలు,వృద్ధులు, మహిళలు, గర్భిణులనే తేడా లేకుండా నిర్దయతో లాఠీలు ఝళిపిస్తూ...

Thursday, October 5, 2017 - 17:36

భూపాలపల్లి : మేడారం అడవుల్లో అధికారుల దాష్టీకంతో గొత్తికోయలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆదివాసీలు ఆర్తనాదాలు చేస్తున్నారు.. రెక్కల కష్టాన్ని నేలకూల్చారని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.. గూడు చెదిరిన గిరిజనులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు... ఆరుబయటే అష్ట కష్టాలతో అవస్థలు పడుతున్నారు.. మేడారం పరిధిలోని లవ్వాల కీకారణ్యంలో జలగలంచ గూడెంపై ఫారెస్ట్ అధికారుల దాష్టీకం తర్వాత...

Thursday, October 5, 2017 - 14:19

భూపాలపల్లి : జిల్లా గణపురం మండలపరిధిలోని కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు 8 ఇంక్లైన్ మైన్ మీద టీజీబీకేఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Thursday, October 5, 2017 - 12:32

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి శ్రీరాంపూర్‌లో 52%, మందమర్రిలో 38%, బెల్లంపల్లిలో 42% పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో 28%, మణుగూరులో 56%, ఇల్లెందులో 63%, సత్తుపల్లిలో 50% పోలింగ్‌ రికార్డయింది. భూపాలపల్లిలో 30% పోలింగ్‌ నమోదు కాగా.. కరీంనగర్‌ జిల్లా ఆర్‌జి1, ఆర్‌జి2, ఆర్‌జి3లో...

Wednesday, October 4, 2017 - 17:46

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి గుర్తింపు యూనియన్‌కు గురువారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ శాంతియుతగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకొనే కార్మికులు... సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారి సందీప్‌ అన్నారు. పోలింగ్‌ భద్రతా...

Tuesday, October 3, 2017 - 15:28

భూపాలపల్లి : దుమ్ము, ధూళి మధ్యే సహవాసం. దట్టమైన దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరిఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశవ్యాధులు. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌తో దుబ్బపల్లి వాసుల నరకయాతన. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌ దుమ్ముతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుబ్బపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ము, ధూళి మధ్య సహవాసం చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. యాష్‌ప్లాంట్‌ దుమ్ము...

Tuesday, October 3, 2017 - 12:00

కరీంనగర్ : భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్‌ఆఫీస్‌లోకి వెళ్లేందుకు సీఐటీయూ నేతలకు అనుమతి నిరాకరించడంతో గొడవ మొదలైంది. సభకు అనుమతి ఇవ్వాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేసినా స్పందించలేదు. అయితే టిబిజికెఎస్ నేతలతో పాటు ఎంపి కవిత,పొంగులేటి, పల్లా, జలగం వెంకట్రావ్‌ను అనుమతించడంపై సీఐటీయూ నేతలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు,...

Tuesday, October 3, 2017 - 11:39

కరీంనగర్ : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలుగా ఉపయోగపడతాయని అధికార పార్టీ భావిస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారు. సింగరేణి...

Tuesday, October 3, 2017 - 07:16

భూపాలపల్లి : గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ పాలకులు మధ్యలోనే వదిలేసిన ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూపాలపల్లిజిల్లా వెంకటాపూర్‌ మండలంలో పాలెం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10వేల 132 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఇరిగేషన్‌ అధికారులు...

Monday, October 2, 2017 - 12:26

జయశంకర్ భూపాలపల్లి : మంగంపేట మండలంలో ఓ పాస్టర్ చేసిన నిర్వాకంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాస్టర్ ఇంటిలో ఓ పుర్రె ఉండడం కలకలం రేగింది. మంగపేట మండలం నర్సాపూర్ గ్రామంలో ఓ చర్చీకి పాస్టర్ గా ఓ వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. 9 నెలల క్రితం అతని భార్య దేవీ అనారోగ్యంతో మృతి చెందింది. సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించి శవపేటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. భార్య...

Pages

Don't Miss