Friday, October 6, 2017 - 12:51

జయశంకర్ భూపాలపల్లి : మేడారం అడవులు లవ్వాల కీకారణ్యం జలగలంచ దాష్టీకంపై సర్కార్‌ కదిలింది. గొత్తికోయ మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుషంపై సీఎం సీరియస్‌ అయ్యారు. భాష, భావం తెలియని గొత్తికోయల అరణ్య రోధన.. అమానుష ఘటనను టెన్‌ టీవీ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. ప్రజా సంఘాల ఆందోళనలు.. రాజకీయ పార్టీల ర్యాలీలు గిరిజనులకు బాసటగా నిలిచాయి. అభయారణ్యంలో ఆదివాసీలపై దాడులను...

Thursday, October 5, 2017 - 21:20

పెద్దపల్లి/మంచిర్యాల/భూపాలపల్లి/కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ముగిశాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. సింగరేణి కాలరీస్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11...

Thursday, October 5, 2017 - 20:03

హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కార్మికులు 11 డివిజన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే సమయానికి 11 డివిజన్లలో మొత్తం 94.93 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52,534 ఓట్లకుగాను 49,873 ఓట్లు నమోదయ్యాయి. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి 12 గంటల వరకు తుది ఫలితం...

Thursday, October 5, 2017 - 17:39

భూపాలపల్లి : భాష తెలియదు..భావం అర్ధం కాదు...నాగరిక ప్రపంచంలో అనాగరికులు...పొట్టకూటి కోసం తరలివచ్చిన వలసజీవులు.. అధికారుల దాష్టీకంతో కుదేలైన అడవిబిడ్డలు..అలాంటి వారిపై కీచత్వం ప్రదర్శించారు. మహిళలపై ఫారెస్ట్ అధికారులు పైశాచికత్వాన్నిప్రదర్శించారు. తల్లులను లాఠీలతో అటవీ అధికారులు చావ బాదడంతో గొత్తికోయ పిల్లలు భీతిల్లారు. మహిళలు, పిల్లల ఏడుపులతో మేడారం అడవి దద్దరిల్లింది. అయినా...

Thursday, October 5, 2017 - 17:38

భూపాలపల్లి : సొంత రాష్ట్రంలో ఆధిపత్య పోరును భరించలేక అటవి బాట పట్టి కాలం గడుపుదామని కొండ కోనల నడుమ గూడెం కట్టుకున్నారు. అడవి ఆదరిస్తే నాగరికులైన అధికారులు ఈ బక్క జీవులను తన్ని తరిమేస్తున్నారు. పదే పదే గొత్తికోయలను టార్గెట్ గా చేస్తూ నిర్దాక్షిణ్యంగా గూడేలపై బడి దాడులకు తెగబడుతున్నారు. చిన్న పిల్లలు,వృద్ధులు, మహిళలు, గర్భిణులనే తేడా లేకుండా నిర్దయతో లాఠీలు ఝళిపిస్తూ...

Thursday, October 5, 2017 - 17:36

భూపాలపల్లి : మేడారం అడవుల్లో అధికారుల దాష్టీకంతో గొత్తికోయలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆదివాసీలు ఆర్తనాదాలు చేస్తున్నారు.. రెక్కల కష్టాన్ని నేలకూల్చారని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.. గూడు చెదిరిన గిరిజనులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు... ఆరుబయటే అష్ట కష్టాలతో అవస్థలు పడుతున్నారు.. మేడారం పరిధిలోని లవ్వాల కీకారణ్యంలో జలగలంచ గూడెంపై ఫారెస్ట్ అధికారుల దాష్టీకం తర్వాత...

Thursday, October 5, 2017 - 14:19

భూపాలపల్లి : జిల్లా గణపురం మండలపరిధిలోని కాకతీయ లాంగ్ వాల్ ప్రాజెక్టు 8 ఇంక్లైన్ మైన్ మీద టీజీబీకేఎస్ నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Thursday, October 5, 2017 - 12:32

హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి శ్రీరాంపూర్‌లో 52%, మందమర్రిలో 38%, బెల్లంపల్లిలో 42% పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెంలో 28%, మణుగూరులో 56%, ఇల్లెందులో 63%, సత్తుపల్లిలో 50% పోలింగ్‌ రికార్డయింది. భూపాలపల్లిలో 30% పోలింగ్‌ నమోదు కాగా.. కరీంనగర్‌ జిల్లా ఆర్‌జి1, ఆర్‌జి2, ఆర్‌జి3లో...

Wednesday, October 4, 2017 - 17:46

జయశంకర్ భూపాలపల్లి : సింగరేణి గుర్తింపు యూనియన్‌కు గురువారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ శాంతియుతగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకొనే కార్మికులు... సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారి సందీప్‌ అన్నారు. పోలింగ్‌ భద్రతా...

Tuesday, October 3, 2017 - 15:28

భూపాలపల్లి : దుమ్ము, ధూళి మధ్యే సహవాసం. దట్టమైన దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరిఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశవ్యాధులు. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌తో దుబ్బపల్లి వాసుల నరకయాతన. కేటీపీపీ యాష్‌ప్లాంట్‌ దుమ్ముతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుబ్బపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ము, ధూళి మధ్య సహవాసం చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. యాష్‌ప్లాంట్‌ దుమ్ము...

Pages

Don't Miss