Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 19:50

జగిత్యాల : టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై మాజీమంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కవితకు మహిళల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించేలా కేసీఆర్‌ మాట్లాడాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాలలో జనవేదన సదస్సు నిర్వహించారు. దీనికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.  నిజామాబాద్‌ పసుపు, చెరుకు రైతుల...

Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Tuesday, February 7, 2017 - 15:57

జగిత్యాల : పది రూపాయల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగిత్యాల జిల్లా అంతర్గమ్‌ మండలంలో 10 రూపాయల కోసం అక్కాచెల్లెల్ల మధ్య వాగ్వావాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అక్క నాగలక్ష్మి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నాగలక్ష్మి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. హనుమంతు-లక్ష్మి దంపతులకు అర్చన-నాగలక్ష్మి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే...

Saturday, February 4, 2017 - 18:38

జగిత్యాల : ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ఆపదలో ఆస్పత్రికి వచ్చిన వారిని వైద్యులు చిన్నచూపు చూస్తున్నారు. రక్షించండి మహాప్రభూ అని వేడుకుంటుంటే.. ప్రాణాలు హరించివేస్తున్నారు. జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది.
రోగికి సెక్యూరిటీ గార్డ్‌ వైద్యం
ఇదిగో చూశారా. రోగికి...

Wednesday, February 1, 2017 - 07:26

జగిత్యాల :వైద్యులు లేక సెక్యూరిటీ గార్డ్‌ అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేస్తున్నాడునుకుంటే పొరపాటు. ఇదిగో పక్కనే డాక్టరమ్మ ఉంది. ఈమె తీరు చూస్తేంటే.. సీనియర్‌ డాక్టర్‌ వైద్యం చేస్తుంటే జూనియర్‌ డాక్టర్‌ పరిశీలిస్తున్నట్లుగా ఉంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి...

Sunday, January 29, 2017 - 14:09

జగిత్యాల : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో గర్భిణీకి నర్సు ఆపరేషన్ చేసింది. దీనితో పసికందు మృతి చెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. గొల్లపల్లి మండలం మౌనిక పురుటినొప్పులతో శనివారం రాత్రి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున వైద్యులు స్పందించకపోవడం..ఆపరేషన్ చేయడానికి రాక పోవడంతో అక్కడనే ఉన్న నర్సు ఆపరేషన్...

Saturday, January 7, 2017 - 16:14

జగిత్యాల : పెద్ద నోట్లు రద్దు చేసిన 60 రోజులు పూర్తైనా బ్యాంకుల్లో డబ్బు అందుబాటులో లేక రైతులు అల్లాడుతున్నారు. రబీ సీజన్‌లో వ్యవసాయ పనులకు నదగు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు జగిత్యాలలో బ్యాంకుల మందు ఆందోళనకు దిగారు. రైతుల నిరసనకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులకు అవసరమైన డబ్బును అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ఆర్ బీఐ, కేంద్ర ప్రభుత్వంపై...

Friday, December 30, 2016 - 17:56

జగిత్యాల: జిల్లా కేంద్రంలో టెన్‌టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. నాలుగు సంవత్సరాల వార్షికోత్సవ క్యాలేండర్‌ను జిల్లా ఎస్పీ అనంత్‌శర్మ ఆవిష్కరించారు. టెన్‌టీవీ మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Wednesday, December 28, 2016 - 11:37

జగిత్యాల : ఎర్రజెండా చేబూని... కదం తొక్కుతూ..పదం పాడుతూ ముందుకు సాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర దిగ్విజయంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు పాదయాత్ర 1890 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 
ప్రజలకు పయోగకరమైన చర్చలు జరగలేదన్న తమ్మినేని  
ఈ పదిరోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగకరమైన చర్చలు జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...

Pages

Don't Miss