Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Monday, January 22, 2018 - 21:59

హైదరాబాద్ : తెలంగాణలో జనసేనాని తొలి అడుగు పడింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తెలంగాణలో పర్యటిస్తున్నానన్న ఆయన.. ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్‌.. ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తానన్నారు. 
ప్రజా యాత్రను...

Monday, January 22, 2018 - 16:48

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్యనేతలతో భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు....

Monday, January 22, 2018 - 15:42

జగిత్యాల : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్‌ అభిమానులు ఆయనకు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు. కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.11 లక్షలు ఇచ్చారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు చేరుకోవడంతో సందడి నెలకొంది. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు....

Monday, January 22, 2018 - 14:49

జగిత్యాల : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్‌ అభిమానులు ఆయనకు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రజాయాత్రకు శ్రీకారం చుడతారు. కరీంనగర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ప్రజాయాత్ర చేయనున్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు...

Monday, January 22, 2018 - 10:25

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. తెలంగాణలోని మూడు జిల్లాలో ఆయన రాజకీయ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కార్యాలయంలో జనసేన కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతిచ్చారు. అనంతరం ఆయన కాన్వాయ్ కొండగట్టుకు బయలుదేరింది. పదేళ్ల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తుండడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు...

Sunday, January 21, 2018 - 17:49

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు తన రాజకీయ యాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు పదేళ్ల తరువాత జిల్లాకు రానున్నారు పవన్. ఇష్టదైవమైన ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ యాత్ర ప్రారంభించనున్నారు. పవన్ రాక సందర్భంగా అభిమానులు చేస్తున్న ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

Pages

Don't Miss