Friday, September 22, 2017 - 17:34

కరీంనగర్/జగిత్యాల : కోతుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఓ యువరైతు వినూత్న ప్రయత్నం చేశాడు. కోతులను పారదోలేందుకు కుక్కను పంటపొలంలో కట్టేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన మహిపాల్ రెడ్డి...తనకు ఉన్న3 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసాడు. అయితే రోజూ కోతుల గుంపు కంకులు తినడంతో పంటను నాశనం చేసేవి. నెలకు వెయ్యి రూపాయల...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Monday, September 18, 2017 - 17:41

జగిత్యాల : సర్కార్‌ దవాఖాన అంటేనే భయపడే రోగులు నేడు నిర్భయంగా వస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా... రోగుల పట్ల వైద్యులు నమ్మకం కలిగించడంతో అందరూ ప్రభుత్వాస్పత్రులలో వైద్యం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి కార్యక్రమాలతో ఆస్పత్రులలో డెలివరీల సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయన్న...

Monday, September 18, 2017 - 15:27

హైదరాబాద్ : బతుకమ్మ చీరలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై నల్లగొండ జిల్లా మహిళలు మండిపడుతున్నారు. రోడ్డుపై చీరలను కుప్పగా పోసి నిరససనకు దిగారు.

ఖమ్మంలో...
బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల చేనేత చీరలని చెప్పిన ప్రభుత్వం..చివరికి నాసిరకం...

Monday, September 18, 2017 - 12:04

హైదరాబాద్ : తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. కొన్ని చోట్ల మహిళలకు చేనేత చీరలకు బదులు సిల్క్ చీరలు పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రేషన్ షాపు మూసివేసి వెళ్లిపోవడంతో మహిళలు అందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా చల్ గల్ లో సిల్క్ చీరలు పంపిణీ చేస్తున్నారని మహిళలు ఆ చీరలను దహనం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Monday, September 18, 2017 - 11:14

కరీంనగర్/జగిత్యాల : జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. రూ.100, రూ200 రూపాయల చీరలు ఇస్తున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. చేనేత చీరలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మీద చీరలు దహనం చేసి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.

Wednesday, September 13, 2017 - 07:19

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్‌జిల్లా అయితే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి...

Sunday, September 10, 2017 - 21:39

కరీంనగర్/జగిత్యాల : నాడు కాంగ్రెస్‌ పాలనలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని..నేడు కేసీఆర్‌ పాలనలో రైతుల కోసం 24 గంటల నిరంతర విద్యుత్‌, ప్రాజెక్టుల కోసం లక్షా 50 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. జగిత్యాల్‌ జిల్లా కథలాపూర్‌లో జరిగిన రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు సమన్వయ సంఘాలు రానున్న రోజుల్లో సమర్థవంతంగా పనిచేసి అన్నదాతలకు...

Sunday, September 3, 2017 - 15:34

కరీంనగర్/జగిత్యాల : శ్రమ... సృజనాత్మకత...వెరసి ప్రభాకర్‌..తక్కువ ఖర్చుతో... ఎక్కువ ఉపయోగపడే పరికరాల సృష్టికర్త..పట్టా లేకున్నా.. సత్తా ఉన్న గ్రామీణ ఇంజనీర్‌..జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన ఇతడి పేరు ప్రభాకర్...! అనేక ప్రయోగాలకు.. కొత్త పరికరాలకు కేరాఫ్‌ అడ్రస్‌! ... సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేయడంలో ప్రభాకర్ నేర్పరి. మధ్య తరగతి...

Pages

Don't Miss