Monday, January 22, 2018 - 14:49

జగిత్యాల : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు చేరుకున్నారు. పవన్‌ అభిమానులు ఆయనకు కొండగట్టులో ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ప్రజాయాత్రకు శ్రీకారం చుడతారు. కరీంనగర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ప్రజాయాత్ర చేయనున్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు...

Monday, January 22, 2018 - 10:25

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. తెలంగాణలోని మూడు జిల్లాలో ఆయన రాజకీయ యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కార్యాలయంలో జనసేన కీలక నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఆయన భార్య లెజినోవా ఎదురొచ్చి హారతిచ్చారు. అనంతరం ఆయన కాన్వాయ్ కొండగట్టుకు బయలుదేరింది. పదేళ్ల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తుండడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు...

Sunday, January 21, 2018 - 17:49

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు తన రాజకీయ యాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు పదేళ్ల తరువాత జిల్లాకు రానున్నారు పవన్. ఇష్టదైవమైన ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ యాత్ర ప్రారంభించనున్నారు. పవన్ రాక సందర్భంగా అభిమానులు చేస్తున్న ఏర్పాట్లపై పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Friday, January 5, 2018 - 22:16

జగిత్యాల : ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ త్యాగాల తెలంగాణ రాలేదన్నారు టీ మాస్‌ నేత గద్దర్‌. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగినట్లే ఇప్పుడు కూడా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఒక్కటికూడా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నారు...

Thursday, January 4, 2018 - 18:00

జగిత్యాలం : తాజా సమాచారాన్ని అందించడంలో 10టీవీ ముందంజలో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అనంత శర్మ అన్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ చేతుల మీదుగా 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. భవిష్యత్తులో కూడా మరింత సమాచారాన్ని అందిస్తు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు టీవీ సూర్యం అన్నారు. కార్యక్రమంలో టీమాస్‌ కన్వినర్‌ నక్క విజయ్...

Pages

Don't Miss