Tuesday, October 10, 2017 - 18:06

జగిత్యాల : ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు... సమన్లు జారీ చేసింది. 'సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు' పుస్తకం... తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ కొందరు కోరుట్ల కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఐలయ్యకు సమన్లు జారీ చేసింది. ఈ పుస్తకం విడుదల తర్వాత.. ఐలయ్యకు బెదిరింపులు రావడంతో... నిన్న ఆయన డీజీపీని కలిసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి...

Tuesday, September 26, 2017 - 20:46

జగిత్యాల : వరుణుడు వర్షాలు కురిపించక పోయేసరికి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతుండటంతో కర్షకుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. జగిత్యాల జిల్లాలో ఆందోళన చెందుతున్న అన్నదాతలపై 10టీవీ ప్రత్యేక కథనం. 

జగిత్యాల జిల్లా జగ్గాసాగర్‌ గ్రామంలో ప్రతి ఏటా మూడు వేల ఏకరాల్లో సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు బాగానే కురవడంతో అన్నదాతలు వెయ్యి ఎకరాల్లో...

Monday, September 25, 2017 - 21:34

కరీంనగర్/ జగిత్యాల : జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ టి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు 16 ఫీట్ల బతుకమ్మను తయారు చేశారు. యాభై మంది మహిళలు కలిసి ఏడు క్వింటాల పూలతో బతుకమ్మను తయారు చేశారు. స్థానిక పొన్నాల గార్డెన్‌ నుండి న్యూబస్టాండ్‌ మీదుగా తహశీల్‌ చౌరస్తా టవర్‌ సర్కిల్‌ నుండి మినీ ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మను ఊరేగిస్తూ మహిళలు...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Friday, September 22, 2017 - 17:34

కరీంనగర్/జగిత్యాల : కోతుల బెడద నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి ఓ యువరైతు వినూత్న ప్రయత్నం చేశాడు. కోతులను పారదోలేందుకు కుక్కను పంటపొలంలో కట్టేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌కు చెందిన మహిపాల్ రెడ్డి...తనకు ఉన్న3 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసాడు. అయితే రోజూ కోతుల గుంపు కంకులు తినడంతో పంటను నాశనం చేసేవి. నెలకు వెయ్యి రూపాయల...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Monday, September 18, 2017 - 17:41

జగిత్యాల : సర్కార్‌ దవాఖాన అంటేనే భయపడే రోగులు నేడు నిర్భయంగా వస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా... రోగుల పట్ల వైద్యులు నమ్మకం కలిగించడంతో అందరూ ప్రభుత్వాస్పత్రులలో వైద్యం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి కార్యక్రమాలతో ఆస్పత్రులలో డెలివరీల సంఖ్య పెరుగుతోంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయన్న...

Monday, September 18, 2017 - 15:27

హైదరాబాద్ : బతుకమ్మ చీరలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతలేని చీరలను పంచుతున్నారంటూ.. కేసీఆర్‌ ప్రభుత్వంపై నల్లగొండ జిల్లా మహిళలు మండిపడుతున్నారు. రోడ్డుపై చీరలను కుప్పగా పోసి నిరససనకు దిగారు.

ఖమ్మంలో...
బతుకమ్మ చీరలపై ఖమ్మం జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల చేనేత చీరలని చెప్పిన ప్రభుత్వం..చివరికి నాసిరకం...

Pages

Don't Miss