Tuesday, December 26, 2017 - 10:31

జగిత్యాల/కరీంనగర్ : జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. 8న తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార నింధితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మరో నింధితుడు విజయ్ పరారీలో ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Saturday, December 16, 2017 - 16:27

జగిత్యాల : జిల్లాలోని మల్లాపూర్ మండలం ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిచే వరకు ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు కట్టబోమని గ్రామస్తులు తీర్మానం చేశారు. ప్రభుత్వానికి చెల్లించే ఇంటిపన్ను, నల్లాబిల్లు, కరెంట్ బిల్లు తదితర పన్నులు కట్టబోమని తీర్మానం చేసి గ్రామపంచాయితీ కార్యాలయానికి అతికించారు. విద్యుత్తు బిల్లులు వసూలు...

Monday, December 4, 2017 - 17:26

కరీంనగర్/జగిత్యాల : రైతులు ఆందోళన నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఎస్సారెస్పీ కెనాల్‌ వద్ద 36వ కిలోమీటరు నుండి 45 కిలోమీటర్ల వరకు 9 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కాల్వలకు మరమ్మతుల పేరుతో...తమ పొలాల్లోకి నీరు రాకుండా అడ్డుకుంటారని దీంతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 7 గ్రామాల రైతులు...

Sunday, December 3, 2017 - 07:01

జగిత్యాల : ఓ పోలీస్‌ ఆన్‌డ్యూట్‌లోనే పీకలదాకా మద్యం సేవించి హల్‌చల్‌ సృష్టించాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం పీఎస్‌లో పోచయ్య ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం డ్యూటీలో ఉండగానే పీలకదాకా మద్యం సేవించాడు. కొత్తపల్లి మండలం వెలిచాల క్రాస్‌రోడ్‌ దగ్గర మద్యం మత్తులో తూలాడు. పక్కనున్న వారిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాదు... దుర్భాషలాడుతూ హంగామా చేశాడు.

Saturday, December 2, 2017 - 17:34

జగిత్యాల : పట్టణంలోని.. పోచమ్మవాడలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని... ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. గత్యంతరం లేక రోడ్డుపైనే అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. చెప్పులు కుట్టుకుని.. జీవనం సాగించే రామకృష్ణ.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స...

Saturday, November 25, 2017 - 10:43

జగిత్యాల : మెట్ పల్లి బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మల్లాపూర్ (మం) ముత్యంపేటలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రిలే నిరహారదీక్షలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. దీనితో రైతు సంఘాలు మెట్ పల్లి బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు మద్దతు తెలుపుతూ పాఠాశాల విద్యా సంస్థలు సెలవు ప్రకటించగా వ్యాపార...

Saturday, November 25, 2017 - 09:32

జగిత్యాల : మెట్ పల్లి బంద్ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మల్లాపూర్ (మం) ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఆనాడు హామీనిచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైనా హామీ నెరవేర్చలేదని రైతులు, విపక్షాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం ఇచ్చిన బంద్ కు పలువురు...

Pages

Don't Miss