Monday, May 29, 2017 - 21:43

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని చెప్పిన సర్వే ఫలితాలను కాంగ్రెస్‌ వాళ్లు బోగస్ సర్వే అనడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తామంతా ఎన్నోసార్లు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపించామన్నారు. కాంగ్రెస్‌ వాళ్లే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వారి సీట్లలో ఎవరు గెలుస్తారో ప్రజలే తీర్పునిస్తారని కేసీఆర్ సవాల్ విసిరారు. 

Sunday, May 21, 2017 - 09:34

జగిత్యాల : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం.. హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది. హనుమాన్‌ దీక్షా పరులతో కొండగట్టు ప్రాంతమంతా కాషాయమయంగా మారిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హనుమంతుడిని దర్శించుకునేందుకు.. పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఈ సందర్భంగా అర్చకులు మూడు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొలిసారి భద్రాచలం నుంచి...

Thursday, May 18, 2017 - 19:54

జగిత్యాల: మల్యాల మండలం ముత్యంపేట్‌లో మంటల్లో చిక్కుకొని రైతు సజీవదహనమయ్యాడు.. పొలంలో ఆదిరెడ్డి అనే రైతు చెత్తకాలుస్తుండగా ప్రమాదవశాత్తూ బాధిత రైతుకు మంటలు అంటుకున్నాయి.. అవే మంటల్లో రైతు కాలిబూడిదయ్యాడు..

Tuesday, May 9, 2017 - 15:14

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. మద్దతు ధర కల్పించాలని కొందరు..గిట్టుబాటు కావడం లేదని మరికొందరు..ఇలా సమస్యలపై రైతులు ఆందోళన బాట పడుతున్నారు. తాజాగా జిల్లాలోని చల్ గల్ లోని వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని సకాలంలో తూకం వేయడం లేదని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు లేవని పేర్కొంటున్నారని...

Wednesday, May 3, 2017 - 13:43

జగిత్యాల : మద్దతు ధర కల్పించండి మహాప్రభో...మమ్మల్ని ఆదుకోండి..అంటూ రైతులు నినాదాలు పాలకుల చెవికి ఎక్కడం లేదు. గత కొన్ని రోజులుగా మద్దతు ధర కోసం ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మద్దతు ధర రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. ఎద్దండి గ్రామంలో బొయాన గంగారం అనే రైతు పసుపు పంటను...

Thursday, April 27, 2017 - 17:53

జగిత్యాల : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభతో కార్యకర్తలకు పండుగ వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు ట్రాక్టర్లు, బండ్లపై వరంగల్‌కు తరలి వెళ్తున్నారు. అయితే ఈ మధ్యలో కొన్నిచోట్ల కార్యకర్తలు రోడ్లపైనే మందుతాగి చిందులేస్తున్నారు. జగిత్యాల నుంచి ట్రాక్టర్‌లో బయల్దేరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వాళ్లలో వాళ్లే గొడవపడి కొండగట్టు దగ్గర రోడ్డుపై కాసేపు హంగామా చేశారు. మందుబాబుల తీరును చూసి...

Thursday, April 27, 2017 - 16:58

హైదరాబాద్ : మామిడి పండ్లంటే ఇప్పటివరకు బంగినపల్లి, నూజీవీడు ఇంకా కొన్ని బ్రాండ్లు గుర్తుండేవి. ఈ రకాలే ఇప్పటివరకు అత్యంత నాణ్యమైనవిగా మనం భావించి తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఈ లిస్టులోకి జగిత్యాల మామిడి వచ్చి చేరింది. రుచిలో ఎప్పటినుంచో జగిత్యాల మామిడి నెంబర్‌వన్‌గా ఉన్న బ్రాండ్‌పేరులేక అది ప్రజాదరణకు నోచుకోలేదు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ జగిత్యాల మామిడికి జాతీయ,...

Sunday, April 23, 2017 - 09:20

జగిత్యాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. బుగ్గారం మండలం బీరసాని గ్రామనికి చెందిన హరీష్, సాయి, మధుకర్, మహేష్ అనే నలుగురు యువకులు బైక్ పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ధర్మపురి మండలం రాయపట్నం బైక్ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెళ్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

Pages

Don't Miss