Tuesday, November 20, 2018 - 19:16

కామారెడ్డి : రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ధనిక రైతులు తెలంగాణలో ఉన్నారన్న పేరు రావాలన్నారు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు. కోరుకున్న తెలంగాణ కావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ...

Saturday, November 3, 2018 - 14:21
కామారెడ్డి : ఓట్ల కోసం రాజకీయ నేతలు పడరాని పాట్లు పడతారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగేవారు కొందరైతే.... డప్పు కొట్టి, డ్యాన్స్‌ చేసేవారు ఇంకొందరు. కానీ ’నాకు ఓటు వేయకండి’ అని మైకుపట్టి ప్రచారం చేస్తున్నాడు ఓ అభ్యర్థి. అంతేకాదు ఓటు వేయవద్దని ప్రచార రథానికి సైతం బ్యానర్లు కట్టుకని మరీ గ్రామాల్లో తిరుగుతున్నాడు.
 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ బీఎల్‌ఎఫ్‌...
Sunday, September 30, 2018 - 20:32

హైదరాబాద్ : కామారెడ్డిలో షబ్బీర్ అలీ తరపున ప్రచారం సందర్భంగా రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి లపై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, గోవర్ధన్ రెడ్డిలను వంద మీటర్ల గొయ్యి తీసి పాతరేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, ఈ ఎమ్మెల్యే...

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Saturday, August 18, 2018 - 06:49

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. గోదావరి, పెనుగంగా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద చేరడంతో.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ భారీగా...

Friday, August 17, 2018 - 21:17

కామారెడ్డి : నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

 

Wednesday, August 15, 2018 - 09:10

కామారెడ్డి : గణతంత్ర, స్వతంత్ర దినోత్సవాలకు భరత మాతను స్మరించుకోవడం అందరికీ తెలిసిందే. కానీ.. భరత మాతకు గుడికట్టి.. నిత్యం పూజలు చేస్తున్నారంటే కొంత ఆశ్చర్యంతోపాటు.. మరికొంత గర్వంగానూ ఉంటుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో దీపారాధన, భజనలు, జేజేల నినాదాలతో మార్మోగుతున్న భరత మాత ఆలయంపై 10టీవీ ప్రత్యేక కథనం..

బిచ్కుందలో ...

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Friday, August 3, 2018 - 06:58

హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4 వేల 3 వందల 83 కొత్త పంచాయతీలు నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Pages

Don't Miss