Friday, June 8, 2018 - 08:26

పెద్దపల్లి : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధుడిని దారుణంగా చంపేశారు. భార్యే చంపేసిందని పోలీసులు భావించి ఆమెను విచారించగా హత్య విషయం చెప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...అప్పన్నపేట పంచాయతీ పరిధిలో కొప్పులు ఓదేలు (65) భార్యతో నివాసం ఉంటున్నాడు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన ఓదేలు ఎప్పటిలాగానే గురువారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. తెల్లారేసరికి రక్తపుమడుగులో...

Thursday, June 7, 2018 - 15:25

కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలందరికీ అందడంలేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కౌలు, పోడు రైతులకు ఈ పథకాన్ని వర్తింపచేయకపోవడాన్ని తమ్మినేని తప్పుపట్టారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని 15 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులకు ఈ పథకం కింద సాయం అందలేదు. దీనిని నిరసిస్తూ సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. దీనిపై...

Wednesday, June 6, 2018 - 18:58

కామారెడ్డి : జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. తన ముగ్గురు పిల్లలకు పురుగుల మందు తాగించి.. తానూ కూడా సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది సుజాత. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. 

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Saturday, May 26, 2018 - 15:54

కామారెడ్డి : ఇన్నేళ్లు కష్టపడ్డారు... ఆ భూమి తమదేనని ఆశగా సాగు చేసుకున్నారు. కానీ రైతుబంధు పథకంతో తమ ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎన్నోఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి తమదు కాదని అధికారులు తేల్చారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు కామారెడ్డి జిల్లా వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామ ప్రజలు. 
రైతులు ఆందోళన 
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటపూర్‌ అగ్రహరం...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Wednesday, May 9, 2018 - 07:07

కామారెడ్డి : జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొందరు నియమ నిబంధనలను తుంగలో తొక్కి.. అక్రమాలకు పాల్పడుతున్నారు. కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుమ్మక్కై మోసాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కామారెడ్డి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నియమ...

Wednesday, May 2, 2018 - 09:24

కామారెడ్డి : గిరిజనుల  సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే.. కేసీఆర్ అంతు చూస్తామని హస్తం నేతలు  హెచ్చరించారు. కామారెడ్డిలో గిరిజన డిక్లరేషన్ సదస్సులో కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. గిరిజనుల రిజర్వేషన్, గిరిజన విశ్వవిద్యాలయం, పోడు భూముల అంశం సహా పలు అంశాలపై టీపీసీసీ డిక్లరేషన్ ప్రకటించింది...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Pages

Don't Miss