Thursday, January 19, 2017 - 17:35

కామారెడ్డి : జిల్లా రైల్వే స్టేషన్‌ దగ్గర పది కిలోల మత్తుపదార్థాన్ని.. పోలీసులు పట్టుకున్నారు. దానిని సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  రూట్‌ వాచ్‌ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన కురుమూర్తి గౌడ్‌ను ఎక్సైజ్‌ అధికారులు తనిఖీ చేసి.. ఆయన దగ్గర ఉన్న పది కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫాజాలం ఏడు లక్షల విలువ చేస్తుందని.. వీరిపై కేసు నమోదు...

Tuesday, January 17, 2017 - 16:36

నిజామాబాద్ : పోలీసులు వేధిస్తున్నారంటూ నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో సత్యనారాయణ అనే ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానిక బస్టాండ్‌ ముందు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు. సంక్రాంతి పండుగ రోజున ధర్మారం దగ్గర జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. దీంతో పోలీసులు స్థానికంగా తిరుగుతున్న ఆటోలన్నిటినీ పీఎస్‌కు తరలించారు...

Monday, January 16, 2017 - 17:46

కామారెడ్డి : జిల్లాలో వైద్యులు లేక గర్భిణి ప్రాణాలు విడిచింది. బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పురిటి నొప్పులతో ఓ మహిళ వచ్చింది. వైద్యులు లేకపోవడంతో స్టాఫ్‌ నర్స్ కాన్పు చేసింది. ఆడపిల్లకు జన్మనిచ్చిన భాగ్య ఐదు నిమిషాల తర్వాత ఊపిరాడక చనిపోయింది. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ లేకపోవడం వల్లే భాగ్య చనిపోయిందంటూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు....

Monday, January 16, 2017 - 15:08

నిజామాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇటుక బట్టీలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. నిబంధలకు నీళ్లొదిలి ఇటుక బట్టీలను నడుపుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులు పొగబారి పోతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి వందల సంఖ్యల్లో బట్టీలు నడుస్తున్నాయి. ఇక వీటిలో చాలా వాటికి అసలు అనుమతులే ఉండవు. నిబంధనలకు విరుద్దంగా వీటిని యజమానులు నడుపుతున్నారు. కేవలం లాభార్జనే...

Monday, January 16, 2017 - 13:46

హైదరాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.. అటు రుణాలు తీసుకోలేక... ఇటు బీమా చెల్లించక రెండువిధాలా నష్టపోతున్నారు.. నోట్ల రద్దు దెబ్బనుంచి కోలుకోలేక అవస్థలు అనుభవిస్తున్నారు..

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 4లక్షల 30...

Tuesday, January 10, 2017 - 16:08

నిజామాబాద్ : అన్నదాతపై ప్రకృతి కరుణించినా...పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం..వ్యవసాయాన్ని కుదిపేసింది. ఓవైపు బ్యాంకుల నుంచి రుణాలు అందక..ఉన్న సంపాదనతో వ్యవసాయాన్ని కొనసాగించలేక..నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతులకు...

Friday, January 6, 2017 - 18:38

కామారెడ్డి : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమది. అక్కడ మూడు రాష్ట్రాల ప్రజలు విభిన్నంగా ఎవరి సంస్కృతులు, సంప్రదాయాల ప్రకారం వారు జీవిస్తున్నారు. మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ మూడు సరిహద్దులు కలిగిన ఓ ప్రాంతం అత్యంత వెనకబడింది. నాయకులు అటువైపే చూడకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. 
జుక్కల్‌ ప్రాంతం 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ప్రాంతం ఇది. గతంలో...

Monday, January 2, 2017 - 13:36

కామారెడ్డి : నల్లబెల్లానికి పెట్టింది పేరు కామారెడ్డి. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల కారణంగా నల్లబెల్లం తయారుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ బెల్లం తయారీ, రవాణాపై అధికారులు పలు ఆంక్షలు విధించడంతో రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. నల్లబెల్లానికి పెట్టింది పేరైనా కామారెడ్డి జిల్లాలో నల్లబెల్లం కొనుగోలు కిరికిరి వీడటం లేదు. సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర...

Sunday, January 1, 2017 - 18:36

నిజామాబాద్‌: పేద ప్రజల కడుపునింపే బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణాలోపంతో యథేచ్ఛగా రేషన్‌బియ్యం అక్రమార్కులకు చేరుతున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డిజిల్లాల్లో రేషన్‌ డీలర్లు ఆడిందే ఆటగా సాగుతోంది.

పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
పేదప్రజల ఆకలి తీర్చాల్సిన రేషన్‌ బియ్యం అవినీతిపరుల పాలవుతున్నాయి. అధికారులు, రేషన్‌...

Pages

Don't Miss