Wednesday, May 9, 2018 - 07:07

కామారెడ్డి : జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కొందరు నియమ నిబంధనలను తుంగలో తొక్కి.. అక్రమాలకు పాల్పడుతున్నారు. కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కుమ్మక్కై మోసాలకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కామారెడ్డి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నియమ...

Wednesday, May 2, 2018 - 09:24

కామారెడ్డి : గిరిజనుల  సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గిరిజనుల పోడు భూముల జోలికొస్తే.. కేసీఆర్ అంతు చూస్తామని హస్తం నేతలు  హెచ్చరించారు. కామారెడ్డిలో గిరిజన డిక్లరేషన్ సదస్సులో కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. గిరిజనుల రిజర్వేషన్, గిరిజన విశ్వవిద్యాలయం, పోడు భూముల అంశం సహా పలు అంశాలపై టీపీసీసీ డిక్లరేషన్ ప్రకటించింది...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 16:35

కామారెడ్డి : దళితులపై దాడులు చేస్తే సహించం..కఠిన చర్యలు తీసుకుంటాం..దళితులపై జరుగుతున్న దాడులు బాధాకరమంటూ పాలకులు చెబుతున్నా వారి రాష్ట్రంలోనే దళితులుపై దాష్టీకాలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో దేశాయిపేటలో 12 దళిత కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా డప్పు కొట్టలేదనే కారణంతో పనులను తొలగించడం.....

Sunday, April 8, 2018 - 10:57

కామారెడ్డి : జిల్లాలో మూడు గోదాముల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. 

Sunday, April 1, 2018 - 11:21

కామారెడ్డి : జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం పిట్లం మహజనసభలో రభస చోటు చేసుకుంది. ప్రైమరీ అగ్రికల్చర్ మాజీ సీఈవో నారాయణరెడ్డిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడని, వెంటనే ఇతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బినామీ పేర్లతో కోట్లకు పడగలెత్తాడని, తన పరిధిలో లేని వారికి లోన్లు ఇస్తున్నాడని పేర్కొన్నారు. లక్ష రూపాయలకు పది వేల రూపాయలు కమీషన్...

Tuesday, March 20, 2018 - 17:31

కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కలకలం రేగింది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ రామ్మోహన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 14 వ ఆర్థిక సంఘం నిధుల్లో తనకు తక్కువగా కేటాయించారని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఎల్ ఆర్ ఎస్ నిధుల్లో తన వార్డుకు తక్కువగా కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Pages

Don't Miss