Friday, April 28, 2017 - 06:59

కడప : బాహుబలి 2 సినిమా విడుదల సందర్భంగా జిల్లాలోని రైల్వే కోడూరులో ప్రభాస్‌ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. బ్యాండు భాజాలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ర్యాలీలో 9 తెల్లగుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్థానిక సిద్దేశ్వర థియేటర్‌ దగ్గర అన్నదానం చేశారు. 

Wednesday, April 26, 2017 - 17:50

కామారెడ్డి : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభకు కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ నుండి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంద ట్రాక్టర్లు బయల్దేరాయి. సభకు వెళ్తున్న వారంతా జాగ్రత్తగా వెళ్లాలని మంత్రి సూచించారు. సభకు రానున్న కార్యకర్తలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోచారం తెలిపారు.

Tuesday, April 18, 2017 - 08:08

కామారెడ్డి : వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హమాలీ అవతారం ఎత్తారు. ఈనెల 27న వరంగల్‌లో జరిగే టీఆర్ ఓస్ సభ రవాణ ఖర్చుల కోసం కూలి పని చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం బస్తాలను ట్రాక్టర్‌లోకి ఎత్తి  రెండు లక్షల రూపాయలు సంపాదించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Sunday, April 2, 2017 - 18:41

నిజామాబాద్ : లారీ యజమానులు చేస్తున్న సమ్మె నేడు నాలుగో రోజుకు చేరింది. సరుకు రవాణా లారీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు వ్యతిరేకంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లారీ యజమానులు ఆందోళనబాట పట్టారు. లారీలను ఎక్కడికక్కడే నిలిపివేసి మార్చి 30 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. పెంచిన చలాన్లు, టోల్‌గేట్‌ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. లారీ యజమానుల సమ్మెకు...

Friday, March 17, 2017 - 20:33

హైదరాబాద్ : అకాల వర్షాలతో తెలంగాణ రైతులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. వడగళ్ల వానలతో కడగండ్లపాలు అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పొలాల్లోనే తడిసి సర్వనాశనం కావడంతో దిగాలుపడ్డారు. దీంతో సాగు కోసం చేసిన అప్పులు తీరేమార్గంలేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు హడలిపోతున్నారు. తెలంగాణలో...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Pages

Don't Miss