Monday, May 29, 2017 - 15:47

కామారెడ్డి : రైతులను ఆదుకునేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన యంత్రలక్ష్మి పథకంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రైతులు లబ్ధి పొందేలోపే అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల యూనిట్లను కార్యకర్తలకు మంజూరు చేయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2016-17 సంవత్సరానికి గానూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వివిధ మండలాలకు ప్రభుత్వం 224 ట్రాక్టర్ల యూనిట్లను మంజూరు చేసింది. ఆర్ధిక...

Thursday, May 18, 2017 - 09:33

కామారెడ్డి : జిల్లాలోని గర్గుల్‌ గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. సుమారు ఆరు గంటలపాటు గ్రామంలోని ఎస్సీ కాలనీలో చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు కర్రలతో కొట్టి తరిమేశారు. తరువాత గర్గుల్‌లో పొదల మధ్య ఎలుగుబంటి తల దాచుకుంది. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎఫ్‌డీవో రేఖ సిబ్బందితో చేరుకొని.. పరిస్థితిని సమీక్షించారు. వెంటనే...

Tuesday, May 16, 2017 - 16:24

కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రైతుల మరణాలు పెరిగిపోతున్నాయి. గిట్టుబాటు ధర లేక..ధాన్యం అమ్ముడుపోక..ఇతరత్రా కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. ఎంపీ కవిత ఇలాఖాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పసుపు రైతు మృతి చెందిన వార్త మరిచిపోకముందే మరో రైతు మృత్యువాత పడ్డాడు. బీబీపేట మండలం జనగామకు చెందిన ఆకుల పోచయ్య తాను పండించిన పంటను విక్రయించడానికి...

Sunday, May 14, 2017 - 10:47

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతూ ఇప్పటికే నానా అగచాట్లు పడుతున్న అన్నదాతలపై ప్రకృతి కూడా కత్తి గట్టింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే చోటు లేక.. ఇచ్చే టార్పాలిన్ లు సరిపోక రైతులు ఎదుర్కుంటున్న తీవ్ర ఇబ్బందులపై టెన్ టీవీ ప్రత్యేక కథనం.

...

Saturday, May 13, 2017 - 18:00

కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. ప్రధానంగా కామారెడ్డి మార్కెట్ యార్డ్ లోనూ, బాన్సువాడ కొనుగోలు కేంద్రాల్లో వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి ముద్దైంది. కాలువల్లోకి కొట్టుకుపోయింది. దీంతో చేతికందిన పంట నీటిపాలైదంటూ... రైతులు లబోదిబోమంటున్నారు.

పెద్ద మొత్తంలో వరి ధాన్యం...
కామారెడ్డి మార్కెట్ యార్డుకు...

Thursday, May 11, 2017 - 18:59

కామారెడ్డి : మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టు గత రెండు నెలల నుంచి ఖాళీగా ఉంది. అంతే కాకుండా కార్యాలయ పాలన చేసే మేనేజర్ ఇంజనీరింగ్‌లో, డిఈ, ఏఈ సీనియర్‌ అసిస్టెంట్లు, అలాగే చెత్త సమస్యలకు శానిటేషన్‌ విభాగంలో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరు కూడా లేరు. దీంతో శానిటరీ జవాన్‌తో నెట్టుకొస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న శానిటరీ ఇన్స్పెక్టరు వెంకటేశ్వర్లు ఇక్కడి...

Monday, May 8, 2017 - 17:52

కామరెడ్డి : పుట్టిన బిడ్డతో పాటు బాలింత మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని మండలం ఆరేపల్లిలో జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నజీరాబేగం, ఏఎన్ఎం అనితల నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ మృతురాలి బంధువులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. రేణుక అనే గర్భిణిని ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏఎన్ఎం...

Thursday, May 4, 2017 - 17:52

కామారెడ్డి : జిల్లాలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అనేక సమస్యలకు నిలయంగా మారింది. తగినంతమంది వైద్యులు లేరు.. సదుపాయాలు లేవు. దీంతో పేదలకు మెరుగైన సేవలు అందడం లేదు. హాస్పటల్‌కి నిత్యం 400 వందల ఓపీ... పది నుంచి 20 వరకు ఇన్‌పేషంట్లు వస్తుంటారు. కానీ ఇక్కడ తొమ్మిది మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.. గైనకాలజిస్ట్‌ ఒకరే ఉండడంతో...

Saturday, April 29, 2017 - 09:56

కామారెడ్డి : వాళ్లంతా ఇళ్లు లేని ఉద్యోగులు. ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తానంది. వేతనంలో నెలసరి వాయిదాలు చెల్లిస్తే సొంత ఇంటివారు అవుతారని 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి.. రాజీవ్‌ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇల్లు లేని ఉద్యోగులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ పథకం.. ఇప్పటికి 8 ఏళ్లు కావస్తున్నా ఏ ఒక్క...

Friday, April 28, 2017 - 06:59

కడప : బాహుబలి 2 సినిమా విడుదల సందర్భంగా జిల్లాలోని రైల్వే కోడూరులో ప్రభాస్‌ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. బ్యాండు భాజాలు, డ్యాన్సులతో హోరెత్తించారు. ర్యాలీలో 9 తెల్లగుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం స్థానిక సిద్దేశ్వర థియేటర్‌ దగ్గర అన్నదానం చేశారు. 

Wednesday, April 26, 2017 - 17:50

కామారెడ్డి : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ సభకు కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ నుండి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వంద ట్రాక్టర్లు బయల్దేరాయి. సభకు వెళ్తున్న వారంతా జాగ్రత్తగా వెళ్లాలని మంత్రి సూచించారు. సభకు రానున్న కార్యకర్తలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోచారం తెలిపారు.

Pages

Don't Miss