Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Friday, September 8, 2017 - 12:38

కామారెడ్డి : ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో పనులు ప్రారంభమైనా.. గడువులోగా పథకాన్ని పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అటు నేతలు.. ఇటు అధికారుల తీరుతో పథకంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నీరుగారుతున్నాయి. 
పనులు పూర్తి చేయటంలో అధికారులు విఫలం 
మిషన్‌...

Sunday, August 20, 2017 - 17:48

కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గాంధారి మండలంలోని గుజ్జుల్‌ గ్రామానికి చెందిన యువకుడు.. వాగులో గల్లంతయ్యాడు. గుజ్జుల్ గ్రామానికి చెందిన దేవిసింగ్‌.. గాంధారిలోని తన ఎరువుల దుకాణాన్ని మూసేశాడు. తరవాత బైక్‌పై గుజ్జుల్‌కు వెళ్తుండగా.. దారిలో వాగు దాటుతూ వరద ఉధృతికి బైక్‌తో సహా గల్లంతయ్యాడు. వాగులో బైక్‌ పైకి తేలగా.. దేవిసింగ్‌ ఆచూకీ తెలియలేదు. దేవిసింగ్‌ కోసం పోలీసులు...

Sunday, August 20, 2017 - 16:27

కామారెడ్డి : జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో.. 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా వర్షాలు లేకపోవడంతో.. చాలా చోట్ల వరి నాట్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. అక్కడక్కడా బోరు బావులలో కూడా నీరు తగ్గింది. రైతులు వరుణ దేవుడి కోసం పూజలు చేశారు. శ్రావణ మాసం కావడంతో వర్షాలు కురవాలని ఎన్నో చోట్ల ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఇప్పుడు...

Saturday, August 12, 2017 - 13:33

కామారెడ్డి : జిల్లాలో ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజా, విద్యార్ధి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడం.. కామారెడ్డి మున్సిపాల్ ఆఫీసు ముందు సభ టెంట్‌ ధ్వంసం చేయడం సిగ్గు చేటని సీఐటీయు నేతలన్నారు. అధికార పార్టీ అహంభావంతో దాడి చేయడం సరి కాదన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయకుండా.. దాడికి గురైనవారిని అరెస్ట్‌...

Friday, August 11, 2017 - 22:02

కామారెడ్డి : జిల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గులాబీ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేయగా... పోలీసులు జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్భందించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. యాత్రను కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో...

Friday, August 11, 2017 - 20:18

కామారెడ్డి : ల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడంలేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. ఈ యాత్ర కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో ప్రారంభించేందుకు జేఏసీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు. జేఏసీ నేతల్ని గులాబీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.....

Friday, August 11, 2017 - 17:02

కామారెడ్డి : టీజేఏసీ చైర్మన్ కోదండరాం కామారెడ్డి జిల్లా చేస్తున్న అమరవీరుల స్పూర్తియాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లిన కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీఎస్ లో ఉన్న ఆయన భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో పోలీసులు కోదండరాంను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Friday, August 11, 2017 - 16:52

కామారెడ్డి :  విద్యార్థి సంఘాలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం సభకు వచ్చిన ఏఐఎస్‌ఎఫ్ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఏఐఎస్‌ఎఫ్‌ నేత పృథ్వీ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థులపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై విద్యార్థిసంఘం...

Pages

Don't Miss