Friday, October 6, 2017 - 16:52

హైదరాబాద్ : బయ్యారం గనులను సింగరేణికి అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అతి పెద్ద పారిశ్రామిక వేత్త అయిన అదానీ తనతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని, గనుల తవ్వకాల్లో..నిర్వాహణలో కోల్ ఇండియా కంటే ఉత్తమమైనదని సింగరేణి అని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదాని గ్రూపు తన దగ్గరకు వచ్చాడని..కరెంటు ఎందుకు పెట్టరని...ఆస్ట్రేలియాలో మైన్స్ ఉందని.....

Thursday, October 5, 2017 - 15:12

నిజామాబాద్ : ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో.. తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కానీ సరిపడా సిబ్బందిని అధికారులు నియమించలేదు. దీంతో కొత్త జిల్లాల్లో పాలన కుంటుపడుతోంది. ప్రభుత్వ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. మూడేళ్లుగా సాధారణ బదిలీలతో పాటు ఇతర బదిలీలు లేక...

Thursday, October 5, 2017 - 09:53

కామారెడ్డి : జిల్లాలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నాయి. దసరాకు నామినేటెడ్‌ పదవులు వరిస్తాయని ఆశించిన నేతల ఆశలు అడియాసలయ్యాయి.  టీఆర్‌ఎస్‌ అధిష్టానం క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేందుకు దసరా పండుగకు నామినేటెడ్‌ పదవుల కోసం కసరత్తు చేసినా చివరి నిముషంలో వాయిదా పడింది. దీంతో పదవులు ఆశించిన నేతలంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

కామారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌...

Tuesday, October 3, 2017 - 11:39

కరీంనగర్ : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలుగా ఉపయోగపడతాయని అధికార పార్టీ భావిస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారు. సింగరేణి...

Friday, September 29, 2017 - 14:38

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా భావించే సింగరేణి ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఆరోసారి జరుగుతున్న ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీజీబీకేఎస్ ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగ ప్రవేశం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు....

Thursday, September 28, 2017 - 21:29

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం భగీరథపల్లిలో అగ్రవర్ణాల దురహంకారం వెలుగుచూసింది. దళితుల ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించిన అనంతరం... చెరువులో వేయడానికి వెళ్తుండగా.. అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. దీనిపై దళిత సంఘాలు కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Wednesday, September 27, 2017 - 16:14

కామారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, సంతాయి పేట గ్రామంలో చోటు చేసుకుంది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురు స్నేహితులు కలిసి చెరువులో దూకారు. స్నానం చేస్తున్న సమయంలో...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Pages

Don't Miss