Tuesday, October 3, 2017 - 13:16

కొత్తగూడెం : సింగరేణి ఉద్యోగులకు ఖచ్చితంగా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ఏరియా ఓపెన్‌కాస్ట్‌లో జరిగిన కార్మికుల సభలో కవిత పాల్గొన్నారు. సింగరేణి అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని... కార్మికులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కవిత.

Tuesday, October 3, 2017 - 12:00

కరీంనగర్ : భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్‌ఆఫీస్‌లోకి వెళ్లేందుకు సీఐటీయూ నేతలకు అనుమతి నిరాకరించడంతో గొడవ మొదలైంది. సభకు అనుమతి ఇవ్వాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేసినా స్పందించలేదు. అయితే టిబిజికెఎస్ నేతలతో పాటు ఎంపి కవిత,పొంగులేటి, పల్లా, జలగం వెంకట్రావ్‌ను అనుమతించడంపై సీఐటీయూ నేతలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు,...

Tuesday, October 3, 2017 - 11:39

కరీంనగర్ : సింగరేణి గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఈ ఎన్నికలుగా ఉపయోగపడతాయని అధికార పార్టీ భావిస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్న నిజామాబాద్‌ ఎంపీ కవిత సింగరేణి ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతున్నారు. సింగరేణి...

Tuesday, October 3, 2017 - 10:27

ఖమ్మం : సింగరేణి ఎన్నికల ప్రచారం తుదిఘట్టానికి చేరుకుంది. గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. టీజీబీకేఎస్ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చివరి రోజున గనుల్లో ప్రచారం నిర్వహించేందుకు పోటీ చేస్తున్న సంఘాలు సిద్ధమయ్యాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ప్రచారం నిర్వహించేందుకు సీఐటీయూ నేతలకు సింగరేణి అధికారులు అనుమతిని...

Friday, September 29, 2017 - 14:38

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా భావించే సింగరేణి ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఆరోసారి జరుగుతున్న ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు..ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీజీబీకేఎస్ ను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగ ప్రవేశం చేశారు. టీజీబీకేఎస్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు....

Monday, September 25, 2017 - 09:17

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. ఏకంగా మున్సిపల్ కమిషనర్ పైనే దాడికి దిగడం కలకలం రేపుతోంది. కేవలం ఫ్లెక్సీలను తొలగించారనే కారణంతో గులాబీ నేతలు ఈ దాడికి పాల్పడడం గమనార్హం.

ఏ అధికార..అనధికార కార్యక్రమమైనా నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని స్వయంగా మంత్రి కేటీఆర్ కిందిస్థాయి నేతలకు సూచనలు..ఆదేశాలు జారీ చేశారు. కానీ పలు ప్రాంతాల్లో జరుగుతున్న...

Monday, September 25, 2017 - 07:21

హైదరాబాద్ : సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. కార్మిక సంఘాలు గెలుపు గుర్రాన్ని ఎక్కేందుకు చిత్రమైన పొత్తులు, అసాధారణ ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. అక్టోబర్‌ 5వ తేదీన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆయా సంఘాలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి కార్మికసంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా మారిపోయాయి. గతంలో...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Sunday, September 17, 2017 - 12:24

హైదరాబాద్ : హలం పట్టే రైతన్నలు తుపాకులు పట్టారు. కలం పట్టే విద్యార్థులు రణం చేశారు. ప్రజల విముక్తి కోసం పోరుబాటపట్టారు. స్వేచ్ఛా వాయువులు పీల్చాల్సిన జనం యుద్ధం చేశారు. అసలు హైదరాబాద్‌ సంస్థానంలో ఈ ఘటనలు ఎందుకు జరిగాయి..? నిజాంపై సామాన్యుడికి ఎందుకు కోపమొచ్చింది..? భూ స్వాముల ఆగడాలకు ఎలా చెక్‌ పడింది..? దక్కన్‌లో ఏం జరిగింది..?

వెట్టి చాకిరి వ్యవస్థ...

Pages

Don't Miss