Thursday, July 12, 2018 - 21:15

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా...

Thursday, July 5, 2018 - 11:18

మంచిర్యాల : జిల్లాలో బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ పసుల సునీతారాణిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు...ప్రతిపక్ష కౌన్సిలర్లతో చేతులు కలపడం చర్చనీయాంశమైంది. కౌన్సిల్‌లోని మరోవర్గం ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గాలనే పట్టుదలను ప్రదర్శిస్తుండగా అవిశ్వాసం వీగాలని...

Thursday, July 5, 2018 - 10:18

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా...అతి పెద్ద మున్సిపాల్టీగా బెల్లంపల్లి ఉంది. మున్సిపాల్టీలో అధికార పార్టీకి అసమ్మతి బెడద పెరిగిపోతోంది. బెల్లంపల్లి రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ప్రతిపక్ష కౌన్సిలర్లతో చేతులు కలుపుతూ ఛైర్ పర్సన్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమౌతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ఇందుకు వ్యూహాలు రచించినట్లు...

Sunday, July 1, 2018 - 13:02

మంచిర్యాల : జిల్లలోని వేవనపెళ్ళి మండలంలో దారుణ హత్య జరిగింది. క్యాతన పెళ్ళి గ్రామంలో మద్యం తాగొద్దు అన్నందుకు ఓవ్యక్తి తన తండ్రిని హతమార్చాడు. శనివారం రాత్రి సాగర్‌ అనే వ్యక్తి తన తండ్రి బాలయ్యపై కర్రతో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నిందితుడు పారిపోయాడు. 

 

Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Monday, June 25, 2018 - 06:30

మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. నాలుగేళ్ళుగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ అన్ని పార్టీల్లో ఉన్న ఉద్యమ ద్రోహుల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని.. దీంతో ఆ పార్టీ ఓవర్‌ లోడై మునిగిపోతుందన్నారు చాడ వెంకటరెడ్డి.

Saturday, June 16, 2018 - 17:44

మంచిర్యాల : కేంద్రంలో ముస్లీం సోదరులు రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దుర్గుణాలను దూరం చేస్తూ.. సద్గుణాలను చాటేందుకు.. రంజాన్‌ మాసంలో 30 రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారని మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా అన్నారు. చెడు వినకుండా..అనకుండా.. చూడకుండా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారని అన్నారు. సంఘ...

Wednesday, June 13, 2018 - 15:11

మంచిర్యాల : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అనుభవజ్నులు చెప్పిన మాటకు నిదర్శనంగా కనిపిస్తోంది వెన్నల మండలంలో చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్న కృష్ణారెడ్డిపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు.

Wednesday, June 13, 2018 - 08:16

మంచిర్యాల : కేసీఆర్ కిట్టు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రిల్లో అన్ని రకాల చికిత్సాలను ఉచితంగా అందించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో మాతా శిశు నూతన విభాగాన్ని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాలు...

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Pages

Don't Miss