Thursday, May 24, 2018 - 08:53

పెద్దపల్లి : జిల్లా మంథనిలో దొంగతనానికి వచ్చి గొంతు కోసిన సంఘటన సంచలనం సృష్టిచింది. మంథనిలోని ఓ రెస్టారెంట్లో పనిచేసే రవి తెల్లవారు జామున రెస్టారెంట్‌ టెర్రస్‌ పై పడుకున్నాడు. ఇతని వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్స్‌ దొంగిలించడానికి ఓ దొంగ ప్రయత్నించారు. రవి ప్రతిఘటించగా ఆ దొంగ రవి గొంతుకోసి పరారయ్యాడు. గాయాలపాలైన బాధితున్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. రెస్టారెంట్‌లో 10 మంది...

Monday, May 14, 2018 - 06:27

మంచిర్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధుకాదని... రాబందు అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు పథకం ఎన్నికల స్టంటేనని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలురైతులు వారికి రైతుబంధు ఎందుకు వర్తింపచేయలేదని ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో కేసీఆర్‌ ఆర్భాటాలకు పోతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Sunday, May 13, 2018 - 09:12

ఆదిలాబాద్ : ఎక్కడ వర్షం పడుతుందో...కష్టపడి..చెమటోడ్చి పండిన పంట నీళ్ల పాలవుతుందో..తమకు ఎక్కడ నష్టం వస్తుందో..అని ధాన్యం వద్ద కాపలా ఉన్న రైతుల పాలిట 'పిడుగు' శాపంగా పరిగణించింది. పిడుగు పడి ముగ్గురు రైతులు దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు అధికారులు సరైన చర్యలు...

Sunday, May 6, 2018 - 16:46

మంచిర్యాల : ఆమె స్వప్నాన్ని ఆర్థిక సమస్యలు చిదిమేస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన కిక్‌బాక్సర్‌.. మరో అంతర్జాతీయ పతకాన్ని సాధించే క్రమంలో ఆర్థిక సమస్యతో తల్లడిల్లుతోంది. రష్యాలో జరిగే అంతర్జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ధనం కోసం అభ్యర్థిస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన కందుల...

Monday, April 23, 2018 - 17:44

మంచిర్యాల : జిన్నారం మండలం కలమడుగు అటవీశాఖ చెక్‌ పోస్టు అవినీతికి ఆలవాలంగా మారింది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నాయీమొద్దీన్‌ వసూళ్లకు పాల్పడుతూ కెమెరాకు చిక్కాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పెళ్లి బృందం బస్సులో ఉంచిన మంచానికి వెయ్యి రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. లేకపోతే కేసు పెడతానని బెందిరించాడు. పెళ్లి బృంద రెండు వందల రూపాయలు ఇవ్వబోతే...

Thursday, April 19, 2018 - 11:39

మంచిర్యాల : జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫారెస్ట్‌ కలప డిపో సమీపంలో రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై టిప్పర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. 

 

Sunday, April 15, 2018 - 16:49

మంచిర్యాల : జిల్లాలోని కన్నెపల్లి మండల కేంద్రంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. విషజ్వరాల బారిన పడి కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందగా...30 మంది వరకూ మంచం పట్టారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోన్నా ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. 
వారం రోజుల్లోనే ఇద్దరు మృతి
...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Pages

Don't Miss