Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Sunday, September 17, 2017 - 10:00

మంచిర్యాల : జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీగా చేరుతున్న వరద నీటితో ప్రాజెక్టు నీటిమట్టం 146 అడుగులకు చేరింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతోంది. మరింత సమాచారం వీడియోలో చూడండి.. 

Friday, September 15, 2017 - 19:33

మంచిర్యాల : జిల్లాలోని లక్షెట్టిపేట గురుకుల విద్యార్థిని సాయినిధి ఆత్మహత్యకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. లక్షెట్టిపేట ఊత్కూర్‌ చౌరస్తా వద్ద విద్యార్థి నాయకులు ధర్నా చేశారు.  ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి.. ప్రాణాలు తీసుకుందని.. విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌...

Thursday, September 14, 2017 - 08:08

కరీంనగర్/మంచిర్యాల/భూపాలపల్లి : గులాబీ పార్టీని ఉద్యమ సమయం నుంచి ఆదరించిన ఉత్తర తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. వాయిదా పడుతూ వచ్చిన సింగరేణి కాలరీస్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో రాజకీయ పార్టీల్లో బొగ్గు గనుల రాజకీయ వేడి రగులుతోంది. గులాబీ పార్టీని సింగరేణి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు...

Saturday, September 9, 2017 - 12:53

మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక.. ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌ ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా సీనియర్లు వేధిస్తున్నారని శిరీష, సాయినిధి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో ఇంటికి ఫోన్‌ చేసి తనను...

Saturday, September 9, 2017 - 12:31

మంచిర్యాల : జిల్లాలోని లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. మరోసారి ర్యాగింగ్‌ భూతం బుసుకొట్టింది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Saturday, September 9, 2017 - 10:35

మంచిర్యాల : లక్సెట్టిపేట గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థినుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక ఇద్దరు 8వ తరగతి విద్యార్థినులు యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Wednesday, August 23, 2017 - 12:23

మంచిర్యాల : నాలుగు నెలల క్రితం మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలంలో.. సాగర్‌ కులాంతర వివాహం చేసుకున్నాడు. కానీ అమ్మాయి తరపు బంధువులు.. సాగర్‌ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్లారు. తప్పించుకొని హైదరాబాద్‌ వెళ్లి.. తిరిగి ఆదివారం ఊరికి బయల్దేరిన సాగర్‌ కనిపించకుండాపోయాడు. సాగర్‌ తల్లి అతని కోసం తల్లడిల్లిపోతోంది. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Tuesday, August 22, 2017 - 18:01

మంచిర్యాల : జిల్లాలో ఓ దళిత యువకుడు అదృశ్యం అయ్యాడు. మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. మందమర్రి మండలం సారంగపల్లికి చెందిన సాగర్‌... 4నెలల కిందట అగ్రకులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి బంధువులు సాగర్‌ కుటుంబ సభ్యులపై దాడిచేశారు. ఇదిలా ఉండగా మూడు రోజులుగా సాగర్‌ కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. అమ్మాయి తల్లిదండ్రులే తమ కుమారుడిని...

Pages

Don't Miss