Wednesday, August 9, 2017 - 10:53

మంచిర్యాల : జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. పంచాయితీ రాజ్‌ సబ్‌ డివిజన్‌ ఏఈ 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డండేపల్లి మండలం, మామిడిపల్లి గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి సంబంధించి దాసరి నరేందర్ అనే కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశాడు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో డ్రీమ్స్‌ బేకరీలో డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ పాపలాల్ పట్టుకున్నారు. ...

Friday, August 4, 2017 - 10:04

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చన్నిబూదలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో దశరథం అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ దారుణానికి భూవివాదమే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నింధితులు బాపు, అక్ష్మి సంజీవ్ పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Friday, August 4, 2017 - 09:08

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చన్నబూదలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో దశరథం అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ దారుణానికి భూవివాదమే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నింధితులు బాపు, అక్ష్మి సంజీవ్ పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Sunday, July 30, 2017 - 13:31

మంచిర్యాల : జిల్లాలోని కాశీపేట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. పెద్దనపల్లిలో కొడుకుపై దాడిచేసిన తండ్రి బండరాయితోమోది హత్య చేశాడు. మార్త గట్టయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకొడుకైన ప్రశాంత్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో తండ్రీకొడుకులు ఘర్షణపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన గట్టయ్య అక్కడేఉన్న బండరాయితో...

Sunday, July 30, 2017 - 11:11

మంచిర్యాల : జిల్లాలోని కాశీపేట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. స్టేషన్‌ పెద్దపల్లిలో తండ్రిని కొడుకు హత్య చేశాడు. తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమి స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Saturday, July 22, 2017 - 16:59

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు మండలం వెంకటాంపేటలో విషాదం చోటు చేసుకుంది. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన మూడేళ్ల బాలుడు శ్రీరామ్‌.... సమీపంలో జేసీబీ తీసిన నీటిగుంటలో పడి మృతి చెందాడు. చిన్నారి మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, July 21, 2017 - 13:09

మంచిర్యాల : ముద్దులొలికే ఈ చిన్నారి పేరు సహర్షిణి. వయసు మూడేళ్లు. మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో నివాసం ఉంటున్న సుగంధ్-మౌనికల కుమార్తె. 40 రోజుల క్రితం వరకు చక్కగా ఆడుకున్న సహర్షిణికి అకస్మాత్తుగా చెవుల నుంచి రక్తం కారడం మొదలైంది. దగ్గర ఉన్న ఆసుపత్రిలో చూపించినా ఫలితం లేకపోవడంతో మంచిర్యాల, కరీంనగర్, వరంగల్‌లోని పెద్దాసుపత్రులలో చూపించారు. అయినా.. చిన్నారి...

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Saturday, July 15, 2017 - 13:08

మంచిర్యాల : జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందారు. జైపూర్ లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో రాకేష్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. రెండో అంతస్తులో ఉంటున్నాడు. కిటికీకి ఆనుకొని అతని బెడ్ ఉంది. కిటికీకి గ్రిల్స్ లేవు. తెల్లవారుజామున.. భవనం కిటికీలో నుంచి కిందికి జారపడి మృతి చెందారు. కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో రాకేష్ జారిపడి చనిపోయారు....

Pages

Don't Miss