Tuesday, July 4, 2017 - 18:49

మంచిర్యాల : జిల్లాలోని తాండూరు ఎస్సై రవి శివాలెత్తిపోయాడు. అచలాపూర్‌కు చెందిన విజయ్‌ అనే యువకుడిపై దాష్టీకం ప్రదర్శించాడు. రాత్రి ఠాణాకు పిలిపించి పైశాచికంగా చితకబాదినట్లు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్సై తీరుపై అచలాపూర్‌ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి ఎస్సై రవిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. 

 

Thursday, June 22, 2017 - 16:41

హైదరాబాద్: సింగరేణిలో జరుగుతోన్న వారసత్వ సమ్మెకు.. మేము సైతం అంటూ కార్మికుల వారసులు ముందుకొస్తున్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి సింగరేణి యాజమాన్యం, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామంటున్నారు. మరో పోరాటానికి యువకులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Saturday, June 17, 2017 - 18:37

హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో కార్మికుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలను కొనసాగించాలంటూ మూడురోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.. కార్మిక సంఘాల నేతల అరెస్టులకు వ్యతిరేకంగా

బంద్‌ పిలుపుతో పలు ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి..

వారసత్వ ఉద్యోగ ప్రక్రియ కొనసాగించాలని...

...
Thursday, June 15, 2017 - 09:33

మంచిర్యాల : జిల్లాలో సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాగైతే పోరాటం చేశారో అదే విధంగా పోరాట స్పూర్తిని కొనసాగిస్తున్నారు. వారసత్వ హక్కు కోసం పోరాట బాట పట్టారు. సమ్మె చేస్తుండడంతో సింగరేణి పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. మూడు నెలల క్రితం ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందచేశాయి. గురువారం ఉదయం కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఇదిలా...

Wednesday, June 14, 2017 - 20:11

మంచిరాల్య : సింగరేణిలో రేపటినుంచి సమ్మె సైరన్‌ మోగనుంది. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్‌తో కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. 3 నెలల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినా.. సింగరేణి యాజమాన్యం కోర్టుకు వెళ్తున్నామని జాప్యం చేసిందని ఏఐటియుసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య మండిపడుతున్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎన్నికల్లో గెలిచిన టీజీబికెఎస్ ఇప్పుడు యాజమాన్యం...

Monday, June 12, 2017 - 19:39

మేడ్చల్‌ : జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌లో రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారు.. అంబేద్కర్‌నగర్‌ చెరువు స్థలంలోని ఇళ్ల కూల్చివేత చేపట్టారు.. తహశీల్దార్‌ ఆధ్వర్యంలో ఈ కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది.. వర్షాకాలం ముందస్తు జాగ్రత్త చర్యల్లోభాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు..

Sunday, June 11, 2017 - 13:09

మంచిర్యాల : జిల్లాలో జూన్ మొదటి వారం నుండే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు చెట్లు..విద్యుత్ స్తంభాలు నేలకూలుతున్నాయి. దీనితో విద్యుత్ నిలిచిపోతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం జనాలను అతలాకుతలం చేసింది....

Wednesday, June 7, 2017 - 21:44

మంచిర్యాల : కవ్వాల్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని గిరిజనులపై ఫారెస్ట్‌ అధికారులు దాడి చేస్తూ.. వారిని అడవికి దూరం చేసే కుట్ర జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారంలో పోడు భూముల నిర్వాసితులు, వృత్తిదారుల సమస్యలపై జరిగిన సదస్సుకు తమ్మినేని వీరభద్రం హాజరై, మాట్లాడారు. పులుల పేరుతో గిరిజనులకు అన్యాయం చేస్తే సీపీఎం పార్టీ ఊరుకోదన్నారు...

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Tuesday, June 6, 2017 - 18:44

మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి కాల్‌టెక్స్‌లో దారుణం జరిగింది. చదువుకోమని మందలించిన తండ్రిపై తనయుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో శరీరం కాలిపోవడంతో   తండ్రి పరిస్థితి విషమంగా మారింది. అస్పత్రికి తరలించి చిక్సిత్స అందిస్తున్నారు. 

 

Pages

Don't Miss