Monday, January 1, 2018 - 15:16

నాగర్ కర్నూలు : ప్రజా సమస్యల్ని వెలికి తీసి, నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి.. కర్షకులవైపు పోరాడే ఛానెల్‌ 10టీవీ అన్నారు పార్లమెంట్‌ మాజీ సభ్యులు మంద జగన్నాధం అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి యూటీఎఫ్‌ భవన్‌లో 10టీవీ క్యాలెండర్‌ను మాజీ ఎంపీ మంద జగన్నాధం, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌లు కలిసి ఆవిష్కరించారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలను, కథనాలను...

Friday, December 29, 2017 - 14:16

నాకర్ కర్నూలు : సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రియుడు రాజేష్ తో కలిసి స్వాతి.. భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హతమార్చింది. భర్త స్థానంలో ప్రియుడు రాజేష్ ను తెచ్చేందుకు స్వాతి హైడ్రామా అడింది. స్వాతి నాటకాన్ని సుధాకర్ రెడ్డి కుటుంబసభ్యులు బయటపెట్టారు. రాజేష్, స్వాతిని నాగర్ కర్నూలు పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు 14 రోజులు...

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Saturday, December 23, 2017 - 15:20

నాగర్‌ కర్నూల్‌ : జిల్లాలో వ్యాపారి సుధాకర్‌ రెడ్డి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వాతిని మహబూబ్‌ నగర్‌ జైలు నుండి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు నాగర్‌ కర్నూల్‌ పీఎస్‌లో స్వాతిని పోలీసులు విచారించనున్నారు. 

 

Thursday, December 21, 2017 - 19:46

నాగర్ కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సీబీఎం ఆస్పత్రిలో మహిళకు డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసి యువతి కడుపులో నుంచి 8 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. జిల్లాలోని ఉప్పునుంతల మండలం తిర్మలాపూర్ కు చెందిన సైదమ్మ (22) అనే యువతి కడుపు నొప్పితో కల్వకుర్తిలోని సీబీఎం ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కడుపులో కణితి ఉందని తేలడంతో ఆమెకు ఆపరేషన్ చేశారు. డా.వంశీకృష్ణ...

Friday, December 15, 2017 - 22:06

నాగర్ కర్నూలు : సుధకార్‌ రెడ్డి హత్య కేసులో నాగర్‌కర్నూలు పోలీసులు సీన్‌ ఆఫ్‌ ఎఫెన్స్‌ను రీక్రియేట్‌ చేశారు. కేసులో A1గా ఉన్న రాజేష్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఫతేపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సుధాకర్‌ రెడ్డిని ఎలా దహనం చేసిన విషయాన్ని రాజేష్‌ ద్వారా తెలుసుకున్నారు. అదే ప్రాంతంలో హత్యకు ఉపయోగించిన గడ్డపార, చున్నీ, ప్లేట్‌, పెట్రోల్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు....

Friday, December 15, 2017 - 16:32

నాగర్ కర్నూలు : సుధాకర్‌రెడ్డి హత్య కేసులో స్వాతి ప్రియుడు రాజేష్‌ను మరికాసేపట్లో నాగర్‌కర్నూలు మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు... నాగర్‌కర్నూలు తీసుకొచ్చారు. భర్త సుధాకర్‌రెడ్డి స్థానంలో ప్రియుడు రాజేష్‌ను తీసుకొచ్చేందుకు స్వాతి చేసిన కుట్ర మటన్ సూప్ కారణంగా...

Friday, December 15, 2017 - 13:28

మహబూబ్ నగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్‌ కాంట్రాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఏ 1నిందితుడు రాజేశ్‌ను శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. అంతకంటే ముందు రాజేష్ ను పత్తేపురంలో అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇక్కడే సుధాకర్ రెడ్డిని హత్య చేశారు. అనంతరం పీఎస్ కు వైద్యులను తీసుకొచ్చి రాజేష్ కు వైద్య పరీక్షలు...

Friday, December 15, 2017 - 11:59

మహబూబ్ నగర్ : సుధాకర్ రెడ్డి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేపట్టారు. ఇప్పటికే స్వాతిని అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. భర్త సుధాకర్ రెడ్డి హత్య కేసులో భార్య స్వాతి..ప్రియుడు రాజేష్ నిందితులు. భర్త ప్లేస్ లో ప్రియుడు రాజేష్ ను ఉంచేందుకు స్వాతి వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. చికిత్స పొందుతున్న రాజేష్ ను నాగర్ కర్నూలు పోలీసులు గురువారం అరెస్టు చేసి నాగర్...

Friday, December 15, 2017 - 10:24

మహబూబ్ నగర్ : భార్య..స్వాతి..ప్రియుడు రాజేష్ చేతుల్లో హత్యకు గురికాబడిన సుధాకర్ రెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. తీవ్రగాయాల పాలై హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జ్ అయిన రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి నాగర్ కర్నూలుకు తీసుకెళ్లారు. అనంతరం అతడిని విచారించారు. ఈ...

Pages

Don't Miss