Sunday, October 15, 2017 - 20:50

నాగర్‌కర్నూల్ : జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన హరీశ్‌...కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. 30 ఏళ్లలో వారు చేయలేనిది..మూడేళ్లలో తాము చేయడంతో అసూయపడుతున్నారని విమర్శించారు. వారు కోర్టులను నమ్ముకుంటే.. తాము ప్రజలను నమ్ముకున్నామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి కృష్ణ జలాలు తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని మంత్రి...

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Tuesday, September 19, 2017 - 10:26

నాగర్ కర్నూలు : మద్యం మత్తులో కన్న తల్లిపైనే దాడి చేశాడు ఓ కసాయి కొడుకు. నాగర్‌కర్నూలు జిల్లా మద్దిమడుగు గ్రామ పరిధిలోని చెంచుగూడెంలో తల్లి పోతమ్మపై కన్న కొడుకు బాణాలతో దాడి చేశాడు. పోతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో భార్యపై సైతం దాడికి యత్నించాడు. తల్లి, భార్య పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని మందలించి వదిలేశారు...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Monday, September 18, 2017 - 10:23

మహబూబ్ నగర్/నాగర్ కర్నూలు : జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో విషాదం చోటుచేసుకుంది. పాతాళగంగలో దూకి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కామరణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

 

 

Sunday, September 17, 2017 - 13:46

నాగర్‌కర్నూల్ : విద్యానగర్‌ కాలనీలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకుకు ఉరివేసిన ఓతల్లి తానుకూడా ఆత్మహత్య చేసుకుంది.  విద్యానగర్‌లో శ్వేత తన భర్త కొడుకుతో కలిసి ఉండేది. భర్త హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో శ్వేత తన కొడుకుకు ఉరివేసింది. ఆ తర్వాత తానుకూడా ఉరివేసుకొని చనిపోయింది. కుటుంబ కలహాలవల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

Saturday, August 12, 2017 - 15:19

నాగర్ కర్నూలు : జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం రేపింది. జిల్లాలోని బిజ్నపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో ఓ వృద్ధుడికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలడంతో అతన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 12వైద్యబృందాలు స్వైన్ ప్లూ పై అవగాహన కల్పిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Sunday, July 30, 2017 - 13:12

నాగర్‌కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని... సీఎంకు జీవితాంతం రుణపడిఉంటామని తెలిపారు. 20వేలమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో కేసీఆర్‌ వెలుగులు నింపారని హర్షం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్‌పై నిన్న కేసీఆర్‌ సంతకం చేశారు.

 

Pages

Don't Miss