Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Monday, September 18, 2017 - 10:23

మహబూబ్ నగర్/నాగర్ కర్నూలు : జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో విషాదం చోటుచేసుకుంది. పాతాళగంగలో దూకి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కామరణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

 

 

Sunday, September 17, 2017 - 13:46

నాగర్‌కర్నూల్ : విద్యానగర్‌ కాలనీలో దారుణం జరిగింది. మూడేళ్ల కొడుకుకు ఉరివేసిన ఓతల్లి తానుకూడా ఆత్మహత్య చేసుకుంది.  విద్యానగర్‌లో శ్వేత తన భర్త కొడుకుతో కలిసి ఉండేది. భర్త హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో శ్వేత తన కొడుకుకు ఉరివేసింది. ఆ తర్వాత తానుకూడా ఉరివేసుకొని చనిపోయింది. కుటుంబ కలహాలవల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.

Saturday, August 12, 2017 - 15:19

నాగర్ కర్నూలు : జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం రేపింది. జిల్లాలోని బిజ్నపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో ఓ వృద్ధుడికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలడంతో అతన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 12వైద్యబృందాలు స్వైన్ ప్లూ పై అవగాహన కల్పిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Sunday, July 30, 2017 - 13:12

నాగర్‌కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని... సీఎంకు జీవితాంతం రుణపడిఉంటామని తెలిపారు. 20వేలమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో కేసీఆర్‌ వెలుగులు నింపారని హర్షం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్‌పై నిన్న కేసీఆర్‌ సంతకం చేశారు.

 

Monday, July 24, 2017 - 13:50

నాగర్‌కర్నూల్‌ : జిల్లా కల్వకుర్తిలోని జేపీ నగర్‌, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను, ఎస్టీ ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ బాలిక ఆశ్రమ పాఠశాలను గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ తనిఖీ చేశారు. గురుకులాలలోని తరగతి గదులను, వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు చదువును అందించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ...

Saturday, July 22, 2017 - 08:58

నాగర్ కర్నూలు : నాగం జనార్దన్‌రెడ్డి... తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరుపున ఐదుసార్లు మంత్రిగా పని చేసిన నేత. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో సొంతపార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేత. ఆ తర్వాత నాగర్‌కర్నూలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెండ్‌గా నెగ్గి, తెలంగాణ వాణి వినించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీజేపీలో...

Friday, July 21, 2017 - 09:55

నాగర్ కర్నూలు : రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల అక్రమ బదిలీల పరంపర కొనసాగుతోంది. బదిలీలకు అవకాశం లేదని గతంలో చెప్పిన ప్రభుత్వం... తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి జడ్ పీహెచ్ఎస్ నుంచి కొంతమంది టీచర్లను ... రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ జడ్ పీహెచ్ఎస్ కి... వెల్దొండ జడ్ పీహెచ్ఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ జడ్ పీహెచ్ఎస్కి బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈనెల 18వ తేదీన రంగారెడ్డి...

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Pages

Don't Miss