Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 16:40

నిర్మల్ : అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు నిర్మల్ జిల్లాలోని భైంసాలో ఘనంగా జరిగాయి. వేలాది బహుజనులతో పాటు అంబేద్కర్ మనువడు రాజా రతన్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేయ్యేళ్లుగా కొన్ని వర్గాల చేతుల్లోనే దేశం ఉందని..అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధమైన ఓటును రాబోయే ఎన్నికల్లోనైనా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని మోడీ అవహేళన చేస్తున్నారని, మనుస్మృతిని...

Sunday, April 1, 2018 - 15:20

నిర్మల్ : జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కడెం మండలం బెల్లాల్ లో అప్పుల బాధ తాళలేక చిట్యాల గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. గంగరాజం మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.3 లక్షలు అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు కూతురి పెళ్లి కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పు దొరక్క మనస్తాపంతో గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Friday, March 23, 2018 - 13:46

నిర్మల్‌ : జిల్లాలో ఖానాపూర్‌ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షా పేపర్‌ లీకయింది. ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రశ్నాపత్రాలను ప్రింట్ చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ పాఠశాలపై దాడి చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త నుండి సెల్‌ఫోన్‌ ద్వారా పేపర్‌ వచ్చిందని విచారణలో తేల్చారు. వ్యాపారవేత్తను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Friday, March 9, 2018 - 09:24

నిర్మల్ : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తలను...మొండాన్ని వేరు చేశారు. ఈ ఘటన భైంసాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం బస్టాండు సమీపంలో మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఓ బ్యాగు ఉండడం చూసి దానిని చెత్త వ్యాన్ లో వేసేందుకు ప్రయత్నించారు. బ్యాగులో నుండి తల పడడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొద్దిదూరంలో మొండెం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు...

Tuesday, February 20, 2018 - 17:54

ఆదిలాబాద్ : గ్రామానికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ దారి తప్పాడు. ఓ మైనర్ బాలికను మోసం చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మణ చాంద మండలం మల్లాపూర్ సర్పంచ్ గా శ్రీనివాస్ ఉన్నాడు. అదే గ్రామంలో తల్లిదండ్రులు..లేని ఓ మైనర్ బాలికపై సర్పంచ్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. పెళ్లి మాట ఎత్తగానే సర్పంచ్ ఆ బాలికను కొట్టి వెళ్లగొట్టాడు. దీనితో ఆ బాలిక...

Thursday, February 15, 2018 - 06:43

నిజామాబాద్ : ఎర్రజొన్నకు మద్ధతు ధర ప్రకటించాలంటూ నిజామాబాద్‌ జిల్లాలో రైతులు ఆందోళన చేస్తున్నారు. చేతికొచ్చిన పంటకు సరైన ధర పెట్టి కొనుగోలు చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ... ఆవేదన చెందుతున్నారు.. పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని... ప్రభుత్వం ఆదుకోకుంటే.... తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్...

Wednesday, February 14, 2018 - 17:43

నిర్మల్ : జిల్లా కడం మండలంలో విషాదం జరిగింది. రేషన్‌ బియ్యం కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు అక్కడే మృతి చెందిన ఘటన గంగాపూర్‌లో చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ అయిన లస్మవ్వ బియ్యం కోసం రేషన్‌ డీలర్‌ ఇంటికి వెళ్లగా ఈ పాస్‌ బయోమెట్రిక్‌ సిగ్నల్‌ లేకపోవడంతో నెట్‌ వర్క్‌ కోసం బిల్డింగ్‌ పైకి ఎక్కారు. వేలిముద్రల కోసం బిల్డింగ్‌ పైకి ఎక్కి దిగుతుండగా జారి పడి లస్మవ్వ అక్కడిక్కడే మృతి చెందింది...

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Pages

Don't Miss